తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు కోలాహలంగా ఉంది. చెన్నై లో సినీ ప్రముఖుల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సూర్య, కార్తీ, రజినీకాంత్, అజిత్, విజయ్ ఇలా ప్రముఖులంతా తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. అజిత్ ఓటు వేసే దగ్గర ఫాన్స్ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఎప్పటినుండో కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రపై న్యూస్ లు వస్తున్నాయి. సినిమాల్లో పీక్స్ లో ఉన్న టైం లోనే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాడంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. మరోపక్క విజయ్ తండ్రి పొలిటికల్ పార్టీ పెట్టి కొడుకు సపోర్ట్ తనకి ఉందని చెప్పడం, కానీ విజయ్ నా సపోర్ట్ మా నాన్నకి లేదు, ఆయన పార్టీతో నాకు సంబంధం లేదంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారాయి.
అయితే చెన్నై లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయ్ సైకిల్ మీద రావడం అందరికి ఆసక్తిని కలిగించింది. చెన్నై రోడ్స్ మీద విజయ్ సైకిల్ తొక్కుతూ ఓటు వెయ్యడానికి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ సైకిల్ మీద వస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విజయ్ ఇలా సైకిల్ మీద రావడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించగా.. మరికొంతమంది నెటిజెన్స్ విజయ్ సైకిల్ మీద వచ్చి ఓటు వేసి ఓటర్లు లో చైతన్యం కలిగించాడు అంటే.. మరికొంతమంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కారణముగా ఇలా సైకిల్ మీద ఓటు వెయ్యడానికి వచ్చి తన నిరసన తెలియజేశాడంటున్నారు. ఏది ఏమైనా సైకిల్ మీద వచ్చిన విజయ్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసాడు.