కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్ మీద వచ్చి ఓటు వెయ్యడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. బిజెపి కి బుద్ది చెప్పేందుకే హీరో విజయ్ ఇలా సైకిల్ మీద వచ్చి పెట్రో, డీజిల్ ధరలు పెరిగినందుకు నిరసన తెలిపాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం.. దానికి విజయ్ సన్నిహితులు ఆ వార్తలకు రిప్లై కూడా ఇచ్చారు. పెట్రో, డీజిల్ పెరిగినందుకు నిరసన కాదు.. కేవలం ఆయన ఇల్లు పోలింగ్ బూత్ కి దగ్గరలో ఉండడం, అక్కడినుండి ఆయన వచ్చే రోడ్స్ ఇరుకుగా సందుల్లా ఉంటాయి కాబట్టి కారు లో వస్తే ట్రాఫిక్ జాం అవుతుంది అని ఆయన సైకిల్ మీద వచ్చి ఓటు వేశారు. అంతేగాని ఇందులో రాజకీయకారణాలు ఏం లేవంటూ వివరణ ఇచ్చి విజయ్ గాలి తీసేసారు.
ఇక తాజాగా కోవిడ్ సెకండ్ వెవ్ విపరీతంగా ఉన్న తరుణంలో చాలామంది హీరోలు కరోనా బారిన పడుతుండడంతో సినిమా షూటింగ్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. అలాంటి తరుణంలో విజయ్ తన 65 వ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం జార్జియా పయనమయ్యాడు. విజయ్ - పూజ హెగ్డే కాంబోలో నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న Vijay65 ఈ మధ్యనే పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఆ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం విజయ్ ఇప్పుడు జార్జియా వెళ్ళాడు. ఈ రోజు ఉదయమే విజయ్ జార్జియా ఫ్లైట్ ఎక్కాడు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో విజయ్ జార్జియా వెళ్లడం వలన ఇబ్బందులు పెడతారేమో అంటూ ఫాన్స్ కంగారు పడుతున్నారు.