ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మెగా ఫాన్స్ ఆక్యుపై చేసారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. దానితో వకీల్ సాబ్ హాష్ టాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు పీకే ఫాన్స్. మరోపక్క అల్లు అర్జున్ పుట్టిన రోజు.. ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్, పుష్ప టీజర్, పుష్ప లుక్ ని ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫాన్స్. మరి ఇంత హంగామా సోషల్ మీడియాలో కనిపిస్తుంటే.. ప్రభాస్ ఫాన్స్ కి తిక్క లేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ న్యూస్ లు తగ్గాయి. ఆయన నటిస్తున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ అప్ డేట్స్ ఎలా ఉన్నా.. రాధేశ్యామ్ అప్ డేట్ కి మాత్రం ప్రభాస్ ఫాన్స్ మొహం వాచిపోతున్నారు.
అందుకే సోషల్ మీడియాలో రాధేశ్యామ్ నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. నిద్ర లే యువీ క్రియేషన్స్ అంటూ హాష్ టాగ్ తో యువీ పరువు తీస్తున్నారు. యువీ క్రియేషన్స్ వారు రాధేశ్యామ్ అప్ డేట్ ఇవ్వాలంటూ ప్రభాస్ ఫాన్స్ #Radheshyam హాష్ టాగ్ తో Nidra Lev UV Creations అంటూ ప్రభాస్ ఫాన్స్ చేసే హంగామా సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. తమ హీరో అప్ డేట్స్ ఇవ్వాలంటూ గతంలోనూ యూవీ క్రియేషన్స్ ని ప్రభాస్ ఫాన్స్ ఇలానే తగులుకున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ యూవీ కి చుక్కలు చూపించడం ఖాయం.