Advertisementt

ఆదిపురుష్ హీరోయిన్ మూడు కోరికలు

Fri 09th Apr 2021 02:55 PM
adipurush heroine,kriti sanon,prabhas heroine,kriti sanon three desires,big house,sky diving,national award,biopic  ఆదిపురుష్ హీరోయిన్ మూడు కోరికలు
Kriti Sanon three desires ఆదిపురుష్ హీరోయిన్ మూడు కోరికలు
Advertisement
Ads by CJ

తెలుగులో మహేష్, నాగ చైతన్య లతో నటించి.. టాలీవుడ్ కలిసిరాక బాలీవుడ్ కి చెక్కేసిన కృతి సనన్ అక్కడ సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. కొన్నేళ్లుగా బాలీవుడ్ నే అంటిపెట్టుకుని ఉన్న కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తుంది. అందులో పాన్ ఇండియా మూవీ.. ప్రభాస్ ఆదిపురుష్ లో కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది. అలాగే బచ్చన్ పాండే మూవీలోనూ కృతి సనన్ హీరోయిన్. అయితే కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే కృతి సనన్ అటు పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కృతి సనన్ ని మూడు కోరికలున్నాయట. అందులో.. 

మొదటిది: ఒక పెద్ద బంగ్లా.. అందులో అంతకన్నాపెద్ద గార్డెన్. ఆ గార్డెన్ లో సేద తీరుతూ ఉదయాన్నే టీ తాగుతూ రిలాక్స్ అవ్వాలనేది మొదటి కోరికట.

రెండవది: స్కై డైవింగ్. ఆ మాజాని ఆస్వాదించడటం రెండవ కోరికట.

మూడవది: జాతీయ స్థాయి పురస్కారం అందుకోవాలట. అంతేకాకుండా చరిత్రలో నిలిచిపోయిన ఓ గొప్ప వ్యక్తి బయోపిక్ లో నటించాలకనేది కృతి సనన్ మూడో కోరికట. 

ఈ మూడు కోరికలను తీర్చుకోవడానికి ఎంతగా కష్టపడాలో అంతగా కష్టపడతాను అంటుంది కృతి. ఆదిపురుష్, బచ్చన్ పాండే లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కాకుండా.. మరో మూడు సినిమాలు కృతి సనన్ చేతిలో ఉన్నాయి. ఇలా ఆఫర్స్ తో బిజీగా ఉంటే.. కృతి కోరికలు నెరవేరడానికి ఎంతో సమయం పట్టదులే.. 

Kriti Sanon three desires:

Adipurush heroine Kriti Sanon three desires

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ