2020 లో కరోనా లాక్ డౌన్ తో విసిగిపోయి వేసారి పోయి ఉన్న జనాలకి 2021 క్యాలెండర్ రాగానే హ్యాపీ గా అనిపించింది.. కరోనా పోయింది అనిపించింది. కలిసొచ్చే కాలం వచ్చేసింది అనిపించింది. క్రాక్ సినిమా థియేటర్స్ వైపు నడిపించింది. జనవరిలో క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే కలెక్షన్స్ వర్షం కురిపించింది రవితేజ క్రాక్. ఇక ఫిబ్రవరిలో ఉప్పెన. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ.. సిల్వర్ స్క్రీన్ పైకి రాగానే యువతరం మొత్తం థియేటర్స్ వైపు కదిలింది. యూత్ మొత్తం కలెక్షన్స్ కురిపించారు. బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు మళ్ళీ ఇండస్ట్రీ వినింది. ఒక బిగ్గెస్ట్ హిట్ వచ్చింది ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి.
మార్చ్ లో జాతి రత్నాలు. వరసగా రెండు నెలలు రెండు సినిమాలతో కాసుల గలగలలు విన్న తెలుగు సినిమా బాక్సాఫీసుకి ఈసారి నవ్వుల గలగలలు కూడా వినిపించారు జాతి రత్నాలు. అందరిని నవ్విస్తూ కుదిరిన సెంటర్స్ లో కుదిరినంత, వీలైనంత దోచేస్తూ, రావాల్సినంత రాబడి రాబట్టేసుకున్నారు. ఇక్కడే కాదు.. అక్కడ ఓవర్సీస్ లో కూడా వన్ మిలియన్ పైగా రాబట్టుకుని ఎవరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని సెన్సేషన్ క్రియేట్ చేసారు ఈ జాతి రత్నాలు.
ఇప్పుడు ఏప్రిల్ నాలుగోనెల వచ్చేసరికి ఈ బాధ్యత తన భుజాన ఎత్తుకున్నాడు వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్. ఓ పెద్ద హీరో సినిమా వచ్చింది. ఇండస్ట్రీకి కొత్త ఊపునిస్తుంది, కొత్త ఊపిరినిస్తుంది.. అని అందరూ ఎదురు చూస్తున్న టైం లో వకీల్ సాబ్ గా వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ అంచనాలు తగ్గట్టే తన ఛరిష్మాని మళ్ళీ చూపించారు బాక్సాఫీసు దగ్గర. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకుకొచ్చారు. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూ కానీ, ప్రేక్షకుల టాక్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఎటోచ్చి ఆంధ్రాలో జరిగిన చిన్నపాటి వివాదాలు తప్ప.. మిగిలినదంతా సవ్యంగానే సాగుతుంది. బాక్సాఫీసు దగ్గర కాసుల కళకళ కనిపిస్తూనే ఉంది. అదే ఊపులో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ లు వకీల్ సాబ్ సక్సెస్ మీట్ పెట్టి మాట్లాడెయ్యడం కూడా జరిగిపోయింది.
కానీ ఇప్పటికి కూడా వకీల్ సాబ్ ఎగ్జిబ్యూటర్స్ లో కానీ, థియేటర్స్ యజమానుల్లో కానీ.. 100 పర్సెంట్ కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే క్రాక్ అనే హిట్ మాస్ వల్ల వచ్చింది. ఉప్పెన అనే హిట్ యూత్ వల్ల వచ్చింది, జాతి రత్నాలు కామెడీ తీసుకువచ్చింది. వకీల్ సాబ్ విషయానికి వచ్చేసరికి థియేటర్స్ రావాల్సిన మెయిన్ ఆడియన్స్ ఫామిలీస్, లేడీస్. ఇప్పుడున్న ఈ కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో థియేటర్స్ కి వీళ్ళు కదులుతారా? వస్తారా? అనేది ఇప్పటికి క్వచ్చన్ మార్క్ గానే ఉంది అందరికి. పవన్ కళ్యాణ్ చరిష్మా రెండు మూడు రోజుల వరకు తిరుగుండదు. క్రౌడ్ పుల్లర్ గా తనకున్న స్టామినాని మళ్ళీ ఓపెనింగ్స్ తో మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఓపెనింగ్స్ తో.
అయితే ఈ సందడి, ఈ సరదా, ఈ హడావిడి, ఈ హంగామా సండే వరకు సాగుతుంది. మండే మాత్రం రావాల్సింది కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా లేడి ఆడియన్స్. ఈ కరోనా సెకండ్ వెవ్ ఉధృతంగా ఉన్న టైం లో వస్తారా? ఈ సినిమాకి కావాల్సినంత ఇస్తారా? అనేది ఇప్పుడు పెద్ద అగ్ని పరీక్షగా మారింది. పవన్ కళ్యాణ్ మరి సినిమాలో అయితే ఆడవాళ్ళ కోసం ఫైట్ చేసారు. అద్భుతంగా పెర్ఫర్మ్ చేసారు అనిపించుకుంటున్నారు అందరి చేత. అదే ఆడవాళ్లు ఈ కరోనా సెకండ్ వెవ్ టైం లో గడప దాటి థియేటర్ గేటు దాక వచ్చేలా చేయగలడా? ఇది ఇప్పుడు పవన్ కి అసలైన అగ్ని పరీక్ష.