ఎవ్వరికి భయపడని లేడి రెబల్, బాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు కరొనకి భయపడుతుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా సినిమా థియేటర్స్ లో 50 ఆక్యుపెన్సీ కి మాత్రమే అనుమతులిస్తూ అటు తమిళనాడు, ఇటు తెలంగాణా ప్రభుత్వాలు ప్రకటన జారీచేశారు. అలాగే మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూ.. అమలువుతున్న ఈ పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అయితే నిర్మాతలు నష్టపోతారు అనే కారణంగా చాలామంది హీరోలు తమ సినిమా రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో చైతు లవ్ స్టోరీ వాయిదా పడగా ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన జయలలిత బయోపిక్ తలైవి సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో కంగనా జయలలిత గా నటించిన తలైవి మూవీ ఈ నెల 23 న విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తలైవిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా టీం ప్రకటించింది. తలైవి పాన్ ఇండియా మూవీ గా అనేక భాషల్లో విడుదలకు సిద్ధం చేసారు. రీసెంట్ గా రిలీజ్ అయిన తలైవి ట్రైలర్ అన్ని భాషల్లోనూ ఆకట్టుకుంది. అయితే కరోనా సెకండ్ వెవ్ కారణముగా సినిమాని ఇప్పట్లో విడుదల చేయలేమంటూ.. మరో కొత్త డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామంటూ మేకర్స్ చెబుతున్నారు. మరి ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలరిలీజ్ డేట్స్ మారుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ రిలీజ్ డేట్స్ తలనొప్పి తప్పేలా కనిపించడం లేదు.