రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కమిట్ అవ్వబోతున్నాడు.. గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీ లైన్ కి చరణ్ ఇంప్రెస్స్ అయ్యాడనే టాక్ నడిచింది. రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి మూవీ పక్కా అనుకున్నారు. కానీ రామ్ చరణ్ సడన్ గా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా ఫిలిం ని లైన్ లో పెట్టేసాడు. జులై అయినా ఆగష్టు నుండి అయినా చరణ్ - శంకర్ కాంబో మూవీ సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉంది. అయితే రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబో పై వచ్చిన వార్తలన్నీ జస్ట్ గాసిప్ అని తేలిపోయింది.
క్రికెట్ నేపథ్యంలో నాని తో జెర్సీ సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరి.. అదే జెర్సీ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరో గా రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న జెర్సీ రీమేక్ నవంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఆయన ఓ ఇంటర్వ్యూ లో చెప్పినదాన్ని బట్టి చూస్తే చరణ్ తో గౌతమ్ తిన్ననూరి మీటింగ్ ఉత్తి రూమర్ అని తెలుస్తుంది. హిందీ జెర్సీ నవంబర్ లో విడుదలవుతుంది అని చెప్పిన గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం కథలు సిద్ధం చేసుకుంటున్నా అని, అవి అవ్వగానే స్టోరీ ని బట్టి హీరోలని కలిసి స్టోరీ నేరేట్ చేస్తానని, ఇంతవరకు ఏ హీరోని కలవలేదని చెబుతున్నాడు. దానితో చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబో జస్ట్ రూమర్ అని తేలిపోయింది.