పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సంచలనం వకీల్ సాబ్ థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే వకీల్ సాబ్ ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచి పెట్టెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వెవ్ ని కూడా లెక్క చెయ్యకుండా థియేటర్స్ కి జనాల్ని రప్పిస్తున్నారు పవన్. పవర్ స్టార్ మ్యానియా వకీల్ సాబ్ చిత్రానికి అడుగడుగునా పని చేస్తుంది. అయితే వకీల్ సాబ్ హిట్ జోష్ లో ఉన్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ లు గబగబా సక్సెస్ సెకెబ్రేషన్స్ చెయ్యడమే కాదు.. థియేటర్స్ రెస్పాన్స్ కి బయలు దేరారు. థియేటర్స్ లో వకీల్ సాబ్ కి ప్రేక్షకులు ఇస్తున్న రెస్పాన్స్ చూసిన దర్శకనిర్మాతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమకి ఏం చెప్పి పంపారో ప్రేక్షకులకు షేర్ చేస్తున్నారు.
ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడానికి వెళుతున్నామని చెప్పగానే... ఆయన బయట పరిస్థితులు బాలేదు.. అందరూ మాస్క్ ధరించి సినిమాకి వెళ్ళండి. సినిమా చూసేటప్పుడుకూడా మాస్క్ లు తియ్యకండి.. కరోనా జాగ్రత్తలు పాటించండి.. ప్రేక్షకులకు అదే చెప్పండి అని చెప్పారని చెప్పిన దిల్ రాజు త్వరలోనే వకీల్ సాబ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లా వకీల్ సాబ్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్టుగా చెప్పాడు. అయితే ఆ ఈవెంట్ కి పవన్ వస్తారా.. రారా.. అనేది మాత్రం చెప్పలేదు కానీ.. వకీల్ సాబ్ మీట్ మాత్రం నిర్వహించినట్లుగా దిల్ రాజు అనౌన్స్ చేసారు.