Advertisementt

బాలయ్య ఫాన్స్ కి గుడ్ న్యూస్

Sun 11th Apr 2021 12:24 PM
balakrishna,boyapati,bb3,balayya - boyapati,bb3 title,ugadi special bb3 title,bb3 title roar,thaman,bb3 title announcement,ugadi special  బాలయ్య ఫాన్స్ కి గుడ్ న్యూస్
Balakrishna BB3 Special Update For Ugadi బాలయ్య ఫాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న BB3 సినిమా ముచ్చట్లు సోషల్ మీడియాలో చాలా తక్కువగా వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. అటు చూస్తే మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లో హడావిడి చేస్తున్నాయి. మరోపక్క సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ రచ్చ చూసిన నందమూరి ఫాన్స్ చాలా డల్ అయ్యారు. బాలయ్య BB3 నుండి అప్ డేట్ ఇవ్వాలంటూ బోయపాటిని అడుగుతున్నారు. చాలా సీరియస్ గా షూటింగ్ చిత్రీకరణలో ఉన్న బోయపాటి BB3 షూటింగ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ముందుకురావడం లేదు. ఇంతవరకు టైటిల్ ఎనౌన్సమెంట్ లేదు.. సినిమా చూస్తే మే 28 న రిలీజ్ డేట్ ఇచ్చేశారనే కన్ఫ్యూజన్ లో ఫాన్స్ ఉన్నారు.

అయితే ఈ ఉగాదికి BB3 టైటిల్ ఇవ్వొచ్చని టాక్ నడుస్తున్న టైం లో ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13 మద్యాన్నం 12.33 గంటలకి బాలయ్య - బోయపాటి BB3 టైటిల్ ఇవ్వబోతుననట్టుగా అనౌన్స్ చేసింది టీం. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న BB3 పై మంచి అంచనాలున్నాయి. అలా వైకుంఠపురములో, రీసెంట్ గా వకీల్ సాబ్ హిట్ జోష్ లో ఉన్న థమన్ మ్యూజిక్ BB3 కి ప్లస్ అవుతుంది అని ఫాన్స్ నమ్ముతున్నారు. ఇక ఉగాదికి టైటిల్ ఎనౌన్సమెంట్ చేస్తే.. అప్పటినుండి అధికారికంగా BB3 ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తుందట టీం. అన్నట్టు #BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఉగాది రోజున BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ నే టీం అనౌన్సమెంట్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అప్ డేట్ తో బాలయ్య ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Balakrishna BB3 Special Update For Ugadi:

Balakrishna-Boyapati Film BB3 Title Roar For Ugadi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ