Advertisementt

క్వారంటైన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Sun 11th Apr 2021 01:11 PM
power star pawan kalyan,corona,pawan security,corona positive,pawan in quarantine,vakeel saab  క్వారంటైన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Pawan kalyan to go in Quarantine క్వారంటైన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ని పవన్ ఫాన్స్, ఆడియన్స్ కూడా లెక్క చెయ్యకుండా వకీల్ సాబ్ సినిమా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుంది. నార్త్ లో చాలామంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. ఇక రీసెంట్ గా పవన్ వకీల్ సాబ్ టీం లో నివేత థామస్ కి కరోనా సోకగా.. ఆమె వకీల్ సాబ్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. ఇక దిల్ రాజు, వేణు శ్రీరామ్ లు వకీల్ సాబ్ థియేటర్స్ హంగామాలో పాల్గొంటున్నారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ అయ్యింది.. ఇక ఏకే రీమేక్, క్రిష్ మూవీ హరి హర వీరమల్లు షూటింగ్స్ తో పాటుగా తిరుపతి ఎన్నికల విషయంలో పవన్ చురుగ్గా పాల్గొనాలని అనుకుంటున్నారు.

కానీ ప్రస్తుతం పవర్ స్టార్ క్వారంటైన్ కి వెళ్లారు. కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారు. క్వారంటైన్ కి వెళ్లినా జనసేన కార్యకలాపాలను అయన టెలికాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్నారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడడంతో పవన్ ఫాన్స్ వర్రీ అవుతున్నారు. ఇక పవన్ క్వారంటైన్ కి వెళ్లడంతో ఆయన నటిస్తున్న ఏకే రీమేక్, హరిహర వీరమల్లు మూవీ షూటింగ్స్ వాయిదా పడడం అనివార్యంగా మారింది.

Pawan kalyan to go in Quarantine:

Power Star Pawan kalyan to go in Quarantine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ