వకీల్ సాబ్ అంటే చాలు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటున్నారే కానీ.. అందులో నటించిన మిగతా యాక్టర్స్ పేర్లు కానీ, దర్శకుడు పేరు కానీ, నిర్మాత పేరు కానీ కనిపించడం లేదు, ఎక్కడా వినిపించడమూ లేదు. పవర్ స్టార్ అంటే వకీల్ సాబ్, వకీల్ సాబ్ అంటే పవర్ స్టార్ అన్నట్టుగా ఉంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్ కి డైలాగ్ డెలివరీకి ఫాన్స్ బ్రహ్మ రధం పడుతున్నారు. నిజంగానే ప్రకాష్ రాజ్ లాంటి టాప్ నటుడిని డామినేట్ చెయ్యడం మాములు విషయం కాదు. అయినప్పటికీ ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుండి పవన్ హీరోయిజం మీదే ప్రోజెక్ట్ అయ్యింది.
విడుదలయ్యాక కూడా పవన్ కళ్యాణ్ నే పొగుడుతున్నారు. అంజలి, నివేత థామస్ మంచి పెరఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళని పొగిడినా.. పవర్ స్టార్ ముందు ఆ పొగడ్తలు తేలిపోతున్నాయి. పింక్ సినిమాలో అమితాబ్ కి ఎంతగా పేరొచ్చిందో.. తాప్సి కి అంతే పేరొచ్చింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ క్రెడిట్ మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. అందులో మూడేళ్లు సిల్వర్ స్క్రీన్ కి గ్యాప్ రావడం కూడా పవన్ క్రేజ్, ఇమేజ్ మరింతగా ఈ వకీల్ సాబ్ కి హెల్ప్ అయ్యింది. అలా వకీల్ సాబ్ కలెక్షన్స్ దిల్ రాజు ఎకౌంట్ లోకి వెళితే.. సినిమా హోల్సేల్ క్రెడిట్ పవర్ స్టార్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది.