అందరికన్నా ముందుగా జనవరిలో సంక్రాతి పండక్కి క్రాక్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసి బిగ్గెస్ట్ మాస్ హిట్ అందుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఇక ఇప్పుడు అందరికన్నా ముందు ఉగాది సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేసాడు. ఉగాదికి ఒక రోజు ముందుగా తన రీసెంట్ మూవీ ఖిలాడీ టీజర్ ని రిలీజ్ చేసాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న ఖిలాడీ టీజర్ ఇంతకుముందే యూట్యూబ్ లో విడుదల చేసింది టీం. ఎప్పుడూ యాక్టీవ్ గా మాస్ పంచ్, కామెడీ పంచ్ లతో అదరగొట్టేసే రవితేజ.. ఖిలాడీగా సస్పెన్స్ కేరెక్టర్ లో కనిపిస్తున్నాడు.
రెండు పాత్రల్లో రవితేజ చాలా డిఫ్రెంట్ గా కొత్తగా ఉన్నాడు. ఒకటి సైకో పాత్రలా వరస హత్యలు చేస్తున్న రవితేజని చూస్తే భయపడడం ఖాయం. అంటే రవితేజ ఈ సినిమాలో సైకో గా విలన్ వేషం వేసాడనిపిస్తుంది. రమేష్ వర్మ గత చిత్రం రాక్షసుడు ఛాయలు ఖిలాడీలో కనిపిస్తున్నాయి. ఖిలాడీ టీజర్ ని సస్పెన్స్ థ్రిల్లర్ లా కట్ చేసారు.. టీజర్ మొత్తం మీద రవితేజ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ యూ ప్లేడ్ స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్.. యు ఆర్ అన్ స్టాపబుల్. ఈ టీజర్ లో హీరో అర్జున్ జస్ట్ కనిపించి కనిపించనట్టుగా ఒక్క షాట్ లో కనిపించాడు. రవితేజ ఇదివరకెన్నడూ టచ్ చెయ్యని జోనర్ లో ఈ ఖిలాడీ ఉండబోతుంది అనేది ఈ టీజర్ లో చూపించేసారు. యాక్షన్ కి యాక్షన్, సస్పెన్స్ కి సస్పెన్స్.. రవితేజ ఖిలాడీ ఇంట్రెస్టింగానే ఉంది.