పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంపై ఏపీ ప్రభుత్వం క్రియేట్ చేసిన కాంట్రవర్సీ గురించి తెలియంది కాదు. కక్ష పూరితంగా వ్యవహరించి.. ‘వకీల్ సాబ్’కి బెనిఫిట్ షో, అదనపు షోలే కాకుండా.. టికెట్ రేట్స్ కూడా ఫిక్స్ చేసి.. ఆ రేట్లకే టికెట్స్ అమ్మాలని రూల్స్ పాస్ చేసింది ఏపీలోని వైసీపీ ప్రభుత్వం. దారుణం ఏమిటంటే.. ఏపీలో నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ చిత్ర టికెట్ ఖరీదు రూ. 150 ఉంటే, ‘వకీల్ సాబ్’ చిత్ర టికెట్ ఖరీదు రూ. 110 ఉండటం. ఇది చాలు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ సినిమాని టార్గెట్ చేసింది అని చెప్పడానికి. మరి ఇంత జరుగుతున్నా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలెవరూ కూడా స్పందించకపోవడం విశేషమనే చెప్పుకోవాలి. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం.. మంత్రి పేర్ని నానికి పిచ్చిపట్టిందంటూ.. వెంటనే అతనికి కరోనా వ్యాక్సిన్‌తో పాటు రాబిన్ వ్యాక్సిన్ కూడా వేయించాలని.. మెగా ఫ్యామిలీ తరపున యాక్షన్‌లోకి దిగారు.
వాస్తవానికి మంత్రి పేర్ని నాని ‘వకీల్ సాబ్’ సినిమాపై చేసిన కామెంట్స్ చూసిన ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఒక సినిమాని పాచిపోయిన సినిమా అనడం ఆయనకే సాధ్యం. ఏం మాట్లాడాలో చేతకానప్పుడు.. తీసుకున్న నిర్ణయం ఇకపై అన్ని సినిమాలకు వర్తిస్తుందని చెప్పేసి సర్దుకుంటే సరిపోయేది. ప్రత్యేకంగా పవన్ నాయుడుగారి సినిమా అంటూ.. ఏదేదో మాట్లాడేశాడు. అందుకే నాగబాబు.. “మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కరోనా వ్యాక్సిన్‌తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ..” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి మెగాభిమానులు కూడా భలే కరెక్ట్‌గా ఇచ్చారంటూ.. మెగాబ్రదర్‌కు సపోర్ట్‌గా నిలిచారు.
అయితే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కూడా రియాక్ట్ అవుతూ.. నాకు కాదు.. మీ ఇద్దరు అన్నదమ్ములకే పిచ్చి, ముందు మీరు ఆ వ్యాక్సిన్ వేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. ‘‘పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు..’’ అని పేర్ని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇలా వీరిద్దరి మధ్య ఫైట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి పేర్ని నాని చేసిన ట్వీట్‌కు మెగా బ్రదర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.