ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో ప్రజల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా.. మహేష్ బాబు GMB ఎంటెర్టైనెంట్న్ నిర్మాణంలో అడివి శేష్ హీరోగా మేజర్ సినిమా తెరకెక్కుతుంది. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ దర్శకుడిగా తెరకెక్కుతున్న మేజర్ అడివి శేష్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనిపిస్తుంది.. తాజాగా విడుదలైన మేజర్ టీజర్ చూస్తుంటే. పాన్ ఇండియా ఫిలిం గా పలు భాషల్లో విడుదల కానున్న మేజర్ సినిమా టీజర్ ఉగాది కానుకగా మహేష్ చేతుల మీదుగా విడుదలైంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా, మలయాళం వెర్షన్ పృథ్వీరాజ్ విడుదల చేసారు. అలవాటైన జోనర్ లో అడివి శేష్ నటన గూస్ బంబ్స్ తెప్పించేదిలా ఉంది.. మేజర్ ఉన్ని కృష్ణన్ గా అడివి శేష్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
రేవతి , ప్రకాష్ రాజ్ శేష్ తల్లి తండ్రి పాత్రల్లో కనిపిస్తున్న ఈ టీజర్ లో అడివి శేష్ భుజానికి బులెట్ గాయమై రక్తం కారుతున్నా.. భరిస్తూ వీరోచితంగా టెర్రరిస్టులని ఎదుర్కునే సైనికుడిగా అడివి శేష్ కనిపిస్తున్నాడు. సైనికుడిగా ఉండడం అంటే ఏమిటి? అనే వాయిస్ తో మొదలైన మేజర్ టీజర్ లో 26/11 లో ముంబై లో జరిగిన టెర్రరిస్ట్ దాడులని మేజర్ ఉన్ని కృష్ణన్ ఎలా తిప్పికొట్టాడు అనేది చూపించారు. బోర్డర్ లో ఆర్మీ ఎలా ఫైట్ చేయాలి.. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని అందరూ ఆలోచిస్తారు.. అదీ దేశ భక్తే.. దేశాన్ని ప్రేమించడం అందరి పనే.. వాళ్ళని కాపాడటం సోల్జర్ పని అంటూ అడివి శేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
ఈ టీజర్ కి మేజర్ హైలెట్ అడివి శేష్ నటన, లుక్స్ అయితే.. మరో హైలెట్ నేపధ్య సంగీతం. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఇక శోభిత దూళిపాళ్ల ఓ షాట్ లో కనిపించగా.. అడివి శేష్ ప్రేమికురాలిగా సాయ్ మంజ్రేకర్ లుక్స్ బావున్నాయి. జులై 2 న మేజర్ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలకు సిద్దమవుతుంది.