పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర సందడి చేస్తుంది. ఏపీలో వకీల్ సాబ్ టికెట్ రేట్స్ ఇష్యుస్ తప్ప వకీల్ సాబ్ ప్రభంజనం అటు ఓవర్సీస్ లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద సినిమా ఈ ఏడాది ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా.. సినిమా కలెక్షన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వినిపిస్తాయి అనుకుంటే.. అసలు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ, వీకెండ్ కలెక్షన్స్ కానీ ఎక్కడా ఏ వెబ్ సైట్ లో కానీ, ఏ సోషల్ మీడియా పేజీ లో కానీ కనిపించలేదు. ఫాన్స్ కూడా వకీల్ సాబ్ రికార్డ్స్ కలెక్షన్స్ అంటూ చేసే రచ్చ కూడా ఎక్కడా వినిపించలేదు.
ఇంత పెద్ద సినిమా రోజువారీ కలెక్షన్స్ విషయంలో ఫాన్స్ పోటీపడుతుంటే.. మిగతా హీరోలు కుళ్ళుకునేలా వకీల్ సాబ్ కలెక్షన్స్ ఉంటాయనుకుంటే.. వకీల్ సాబ్ కలెక్షన్స్ ముచ్చట తీసిందే లేదు.
కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు. న్మిర్మాత దిల్ రాజుని పిలిచి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమాకి సంబందించిన కలెక్షన్స్ కానీ, రెవిన్యూ కానీ, రికార్డ్స్ కానీ ఎలాంటివి రిలీజ్ చెయ్యొద్దు, ఎలాంటి ఆఫీషియల్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దు అని దిల్ రాజు కి పవన్ వార్నింగ్ ఇవ్వడం వలనే దిల్ రాజు వకీల్ సాబ్ కలెక్షన్స్ ని విడుదల చెయ్యకుండా సైలెంట్ అయ్యాడట. లేదంటే ఫస్ట్ డే, సెకండ్ డే, వీకెండ్, మండే కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయేది.