Advertisementt

ఆచార్య: సిద్ద తో పూజ హెగ్డే రొమాంటిక్ గా

Tue 13th Apr 2021 11:47 AM
ram charan,acharya,pooja hegde,chiranjeevi,ram charan,plays siddha,pooja hegde plays,neelambari,ram charan and pooja hegde,romance in new poster,acharya directed by koratala siva,achara release on may 13 6  ఆచార్య: సిద్ద తో పూజ హెగ్డే రొమాంటిక్ గా
Acharya: Siddha and Neelambari Romantic Poster ఆచార్య: సిద్ద తో పూజ హెగ్డే రొమాంటిక్ గా
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13 న విడుదలకు సిద్దమవుతుంది. కరోనా కారణంగా  షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే అనుకున్న టైం కే ఆచార్య వచ్చేస్తుంది. ఇకపోతే ఆచార్య సినిమాలో చిరు తో పాటుగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తండ్రి కొడుకుల మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ద గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా చరణ్ పుట్టిన రోజున ఆచార్య నుండి సిద్ద లుక్ ని రివీల్ చేసిన టీం ఉగాది రోజున సిద్ద ని తన ప్రేమికురాలితో రొమాంటిక్ గా రివీల్ చేసింది. ఆచర్యలో రామ్ చరణ్ సిద్ద పాత్రకి జోడిగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది. 

సిద్ద - నీలాంబరి పాత్రధారి పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ ని ఉగాది కానుకగా రిలీజ్ చేసింది ఆచార్య టీం. రామ్ చరణ్ మెడలో రుద్రాక్ష మాలతో వైట్ టి షర్ట్ తో పూజ హెగ్డే ని అలా రొమాంటిక్ గా పట్టుకుని ఉన్న పోస్టర్ క్యూట్ గా రొమాంటిక్ గా ఉంది. పూజ హెగ్డే కూడా కాస్త డీ గ్లామర్ గా అనిపిస్తూ ఓల్డ్ లుక్ లో కనిపిస్తుంది. సారీ లో పూజ హెగ్డే నీలాంబరిగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. రామ్ చరణ్ తో ఫస్ట్ టైం ఇంత రొమాంటిక్ గా పూజ హెగ్డే నటించడం. గతంలో చరణ్ తో రంగస్థలం లో ఓ ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే స్టెప్స్ వేసినా.. ఆచార్య లో వీళ్లది ఫ్రెష్ జోడిగా కనిపిస్తుంది. ఆచార్యలో చరణ్ - పూజ కాంబో పై ఫాన్స్ లో మంచి అంచనాలున్నాయి. 

Acharya: Siddha and Neelambari Romantic Poster:

Acharya: Charan and Pooja Hegde Romance

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ