బాలకృష్ణ బోయపాటి BB3 టైటిల్ అండ్ లుక్ కోసం నందమూరి ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. BB3 షూటింగ్ ఆలస్యంగా మొదలు పెట్టడంతో బోయపాటి BB3 షూటింగ్ కి ఎక్కడా అంతరాయం కలగకుండా ఫాస్ట్ గా చిత్రీకరిస్తున్నాడు. మే 28 ఎన్టీఆర్ వర్ధంతికి BB3 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శతవిధాలుగా కష్టపడుతున్నారు. అయితే రిలీజ్ డేట్ ఇచ్చినా.. BB3 టైటిల్ విషయంలో బాలయ్య - బోయపాటి లు ఇలా నాన్చడం నందమూరి ఫాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. ఇక BB3 టైటిల్ కోసం ఫాన్స్ ని ఎక్కువగా వెయిట్ చేయించకుండా ఉగాది కానుకగా BB3 లుక్ అండ్ టీజర్ ని ఒకేసారి రివీల్ చేసింది టీం.
బోయపాటి మార్క్ మాసిజం, బాలయ్య హీరోయిజం కలిస్తే ఓ సింహ, ఓ లెజెండ్ పుట్టినట్టుగా.. మరోసారి ఈ కాంబో హ్యాట్రిక్ మూవీ గా అఖండ పుట్టింది. బాలయ్య - బోయపాటి BB3 టైటిల్ ఎవరూ ఊహించని టైటిల్ పెట్టి అందరికి షాకిచ్చారు. నిన్నటి వరకు బాలయ్య BB3 టైటిల్ గాడ్ ఫాదర్ అంటూ ప్రచారం జరిగింది.. కానీ నేడు బాలయ్య BB3 కి అదిరిపోయే పవర్ ఫుల్ టైటిల్ పెట్టాడు బోయపాటి. అదే అఖండ. అఖండగా బాలయ్య విశ్వరూపం ఈ సినిమాలో ఎలా ఉంటుందో అఖండ టీజర్ తో రివీల్ చేసింది టీం. BB3 లో బాలకృష్ణ అఘోర పాత్ర చేయబోతున్నారని అన్నట్టుగానే బాలకృష్ణ పవర్ ఫుల్ అఘోర గెటప్ లో రుద్రక్షలతో అదరగొట్టేసాడు.
చేతిలో త్రిశూలం, మెడ నిండా రుద్రాక్ష మాలలు, చేతికి రుద్రాక్షలు, నుదిటిన బొట్టుతో, నామాలతో హరహర మహాదేవ - శంభో శంకర అంటూ బాలయ్య అఖండ టీజర్ లో ఎంట్రీ ఇచ్చారు. కుడి చేతి భుజానికి శివుడి మూడో కన్ను పచ్చ బొట్టు వేయించుకుని.. అబ్బో బాలయ్య గెటప్ కి నందమామూరి ఫాన్స్ కి పూనకాలే. సాధారణ ప్రేక్షకుడికి గూస్ బాంబ్స్ వచ్చేలా ఉంది ఆయన గెటప్. బాలయ్య అలాంటి గెటప్ లో చేతిలో త్రిసూలంతో విలన్స్ ని వేటాడితే.. కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలెట్. బాలయ్య అఘోర గెటప్, బోయపాటి మార్క్ డైరెక్షన్, థమన్ మార్క్ నేపధ్య సంగీతం అన్ని అఖండ టీజర్ కి సూపర్బ్ హైలెట్స్. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ తథ్యం అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. నందమూరి ఫాన్స్ కి ఉగాది ఫెస్టివల్ తో పాటుగా BB3 టైటిల్ టీజర్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది.