Advertisementt

బాలయ్య బాణం ఎవరికి తగిలింది

Tue 13th Apr 2021 07:07 PM
balakrishna,boyapati,bb3 title,balayya akhanda movie,akhanda powerful title,balayya - boyapati bb3,bb3 title akhanda,akhanda teaser,balayya akhanda teaser,akhanda teaser reviews,balayya aghora look,kodali nani,political setairs  బాలయ్య బాణం ఎవరికి తగిలింది
Balakrishna Akhanda Teaser బాలయ్య బాణం ఎవరికి తగిలింది
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న BB3 టైటిల్ ని టీజర్ తో సహా రివీల్ చేసింది టీం. ఉగాది కానుకగా బాలయ్య అఖండగా విశ్వరూపం చూపించిన అఖండ టీజర్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. గతంలో BB3 మొదలు పెట్టినప్పుడే బాలయ్య బర్త్ డే కి టీజర్ ని వదిలాడు బోయపాటి. అందులో బోయపాటి మార్క్ మాస్, బాలయ్య హీరోయిజంతో పొలిటికల్ సెటైర్స్ తో కూడిన డైలాగ్స్ బాగా పేలాయి. తాజాగా అఖండ టీజర్ లో అఘోరాగా బాలయ్య పేల్చిన డైలాగ్ బాణం ఎవరికి తగిలింది అంటూ ఇప్పుడు పొలిటికల్ గా చర్చలు మొదలయ్యాయి..

వైసిపి లో మంత్రిగా ఉన్న కొడాలి నాని నోరు తెరిస్తే బూతులు. పది మాటల్లో ఒక్క మాట మంచిగా ఉంటే.. మిగతా తొమ్మిది భూతు పదాలతోనే కొడాలి మంత్రిగా హైలెట్ అవుతున్నాడు. ప్రతిపక్షాన్ని భూతు పదాలతో రెచ్చిపోయి తిట్టే కొడాలి నానికి బాలయ్య పొలిటికల్ గా ఇండైరెక్ట్ గా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా అఖండ లో బలకృష్ణ పవర్ ఫుల్ అవతారంలో త్రిసూలం తిప్పుతూ కాలుదువ్వే నంది ముందు రంగు మార్చే పంది.. కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది అనే డైలాగ్ పొలిటికల్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. 

అంటే టిడిపి నుండి వైసిపి లోకి వెళ్లి అక్కడ ఎమ్యెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక కొడాలి నాని ఇష్టం వచ్చినట్లుగా మట్లాడం చూసిన బాలయ్య ఈ సినిమా ద్వారా హెచ్చరించాడంటూ ఫాన్స్ నానిని ఆడుకుంటున్నారు. బాలయ్య చేతిలో కొడాలికి పగిలిపోవడం ఖాయం. ఇంతకుముందు టీజర్ లోనే నాని కి డైరెక్ట్ వార్నింగ్ లాంటిది ఇచ్చిన బాలయ్య ఈసారి ఏకంగా కాపాలాన్ని పగలగొడతా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.. నాని నోరు జాగ్రత్త.. అంటూ నాని పై బాలయ్య ఫాన్స్ సెటైర్స్ వేస్తున్నారు.

Balakrishna Akhanda Teaser :

Balakrishna Akhanda Teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ