ఎన్టీఆర్ - త్రివిక్రమ్ NTR30 మొదలు కావాల్సింది.. కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయి.. NTR30 ప్రాజెక్ట్ లోకి కొరటాల శివ వచ్చాడు. కొరటాల - ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30 సెట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వచ్చింది మొదలు.. జనతా గ్యారేజ్ హిట్ అయిన కాంబో కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి మూవీ వస్తుందో అనే క్యూరియాసిటిలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. కొరటాల మళ్ళీ ఏం మ్యాజిక్ చేస్తాడో అంటూ ఫాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న కొరటాల శివ ఆచార్య రిలీజ్ కాగానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై కూర్చుంటాడు.
అయితే ఎన్టీఆర్ - కొరటాల హీరోయిన్ పై అప్పుడే హాట్ హాట్ చర్చలు మొదలైపోయాయి. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో పూజాహెగ్డే కాకుండా కియారా ఎన్టీఆర్ హీరోయిన్ గా పెట్టమన్నాడనే టాక్ నడిచింది. ఇప్పుడు అదే కియారా అద్వానీ కొరటాల - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం తీసుకురాబోతున్నారనే టాక్ మొదలైంది. కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానినే హీరోయిన్. కొరటాల శివ చెబితే కియారా ఒప్పుకుంటుంది కాబట్టి.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే NTR30 లో కియారా హీరోయిన్ గా ఫైనల్ అవుతుంది.