కరోనా సెకండ్ వెవ్ అన్ని వర్గాల ప్రజలని భయపెడుతుంది. సినిమా సెలబ్రిటీస్, పొలిటికల్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా కరోనా బారిన పడడం కలవరం సృష్టిస్తుంది. టాలీవుడ్ లో దిల్ రాజు దగ్గర నుండి చాలామంది కరోనా పోజిటివ్స్ తో హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతే.. రెండోసారి కరోనా సోకి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఐసియులో క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఇక నార్త్ లో చాలామంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడడంతో వారు నటిస్తున్న సినిమా షూటింగ్స్ వాయిదా పడుతుంటే.. ఇప్పడూ మహారాష్ట్ర సర్కార్ ఏకంగా షూటింగ్స్ ఆపెయ్యమని ఆదేశాలు జారీ చేసింది. ఓ 15 రోజుల పాటు మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూని అమలు చేయబోతున్నట్లుగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించారు.
ఈ రోజు రాత్రి నుండి ప్రభుత్వ, ప్రవేట్ కార్యకలాపాలకు, ఆఫీస్ లకి, సినిమా హాళ్ళకి, పార్క్ లకి, హోటల్స్, పర్యాటక ప్రదేశాలకి సెలవు ప్రకటించడమే కాదు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రావొద్దని, అలాగే మహారాష్ట్రలో జరిగే షూటింగ్స్ అన్ని ఆపెయ్యల్సిందే అంటూ ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. లాక్ డౌన్ సంపూర్ణంగా లేకపోయినా.. మహా జనతా కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని చెప్పడంతో.. బాలీవుడ్ సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పటికే కరోనా వలన చాలా సినిమాలు పోస్ట్ పోన్ దిశగా వెళుతున్నాయి. ఇప్పుడు ఈ 15 రోజుల జనతా కర్ఫ్యూతో మరెన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయో చూడాలి.