ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అనిపించుకున్న శృతి హాసన్ కి లుక్స్ విషయంలో మైనస్ మార్కులు పడుతున్నా.. ఆమె కి పెరఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు పడుతున్నాయి. క్రాక్ లో లుక్స్ వైజ్ గా నెగెటికివె ఫీడ్ బ్యాక్ ఇచ్చినా అదే సినిమాలో శృతి చేసిన ఫైట్ కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక తాజాగా వకీల్ సాబ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఆవడంతో శృతి హాసన్ హ్యాపీ. వకీల్ సాబ్ లో శృతి లుక్స్, ఆమె ఎపిసోడ్ మీద నెగెటివ్ గా అనిపించినా అది బ్లాక్ బస్టర్ లో పడి కొట్టుకుపోయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో లైవ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది శృతి హాసన్.
అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో మూడోసారి పని చెయ్యడం ఎలా అనిపించింది అని అడగగానే.. అద్భుతంగా ఉంది అంది. మూడోసారి ఆయనతో వర్క్ చెయ్యడం నా అదృష్టం. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒక్క పదం అనగా.. మహనీయుడు అంటూ పవన్ కళ్యాణ్ ని పొగిడేసింది. నటి కాకపోయి ఉంటే.. క్రియేటివ్ గా ఏదో ఒకటి చేసే దాన్ని అని చెప్పింది శృతి హాసన్. ప్రస్తుతం తాను ముంబై లో ఉన్నాను అని.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో వర్క్ చెయ్యడం కొత్తగా ఉందని.. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పిన శృతి హాసన్ ప్రభాస్ తో కలిసి సలార్ లో నటించడం ఇష్టంగా ఉందని చెప్పింది.
ఇక మహేష్ గురించి ఒకమాట చెప్పనగానే.. మహేష్ జంటిల్మన్ అంటూ మహేష్ తో పని చెయ్యడం హ్యాపీగా ఉంటుంది అని చెప్పింది శృతి హాసన్. ఈ ఏడాది తాను నటించిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ అయినందుకు సంతోషంగా ఉందని.. ఆ ప్రాజెక్ట్స్ లో తాను ఉన్నందుకు గర్వంగా ఉంది అంటూ అభిమానులతో పిచ్చ పాటి మాట్లాడింది శృతి హాసన్.