పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఓ ఫొటోని మీడియాకు విడుదల చేశారు. ఎప్పుడైతే ఆ ఫొటోని చూశాడో.. దీని కోసమే కాచుకుని కూర్చున్నాడనేలా.. వివాదస్పద దర్శకుడు, కంత్రీ వర్మ.. ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయాడు. పవన్ కల్యాణ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోని షేర్ చేసి.. వరుసగా సిల్లీ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే.. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. అందుకే పవన్ కల్యాణ్ ఇలాంటి డ్రామా ఆడుతున్నాడు.. నిజంగా పవన్ కల్యాణ్‌కి కరోనా రావడం ఏమిటి? వచ్చినా.. అలా బెడ్‌పై పడుకుని సెలైన్, ఆక్సిజన్ గట్రా పెట్టుకోవడం ఏమిటి? అనే అర్థం వచ్చేలా వరుస ట్వీట్స్‌తో తన పైత్యాన్ని ప్రదర్శించాడు. గత కొన్ని రోజులుగా సెలైంట్‌గా ఉంటున్న వర్మకు ‘దెయ్యం’ పట్టింది. సారీ.. ‘దెయ్యం’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి ప్రీ పబ్లిసిటీ కావాలంటే.. ఇలాంటి సందర్భం ఒకటి కావాలి. అందుకే ట్విట్టర్ పిట్టకు, తన పిట్టకు కూడా పని కల్పించాడు వర్మ. తన పిట్ట ఎవరని అనుకుంటున్నారు? కదా..! ఇంకెవరు.. శ్రీరెడ్డి. పవన్ కల్యాణ్ బెడ్ పక్కన శ్రీరెడ్డి కూర్చుని ఉన్నట్లుగా ఓ మ్యాజిక్ పిక్‌ని కూడా క్రియేట్ చేసి వదిలాడు వర్మ. మొదట్లో ఆయన చేసిన ట్వీట్స్.. నిజమేనేమో.. అనిపించినా.., శ్రీరెడ్డిని పక్కకు చేర్చడంతో వర్మ కావాలనే కెలుకుతున్నాడనేది నెటిజన్లకు కూడా అర్థమైపోయింది.
ఇక ‘వకీల్ సాబ్’పై వర్మ చేసిన ట్వీట్స్ విషయానికి వస్తే..
‘‘ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? చెప్పండి యువర్ ఆనర్’’ అంటూ పీకే అభిమానులకు కూడా ఓ ఛాలెంజ్ విసిరారు. ‘‘వేరే హీరోల ఫ్యాన్స్ అంతా పవన్ దుస్థితికి కరోనా కారణం కాదు. వకీల్ సాబ్ వసూళ్లే కారణమని అంటున్నారు. రండి, కదలండి, ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపండి’’ అంటూ వకీల్ సాబ్ కలెక్షన్లపై తన ఓర్వలేనితనాన్ని బయటపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలో విడుదలైన పవన్ ఫొటోని పోస్ట్ చేసి.. ఆర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని పేర్కొన్న ఆర్జీవీ.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని దర్శకధీరుడు రాజమౌళిని కోరాడు. అలాగే తప్పును బయటపెట్టిన వారి ఫొటోను తాను పెట్టి మంచి బహుమతి కూడా ఇస్తానని వర్మ మరో ట్వీటేశాడు. మళ్లీ తనే.. ‘‘ఫేక్ అని నేనట్లేదు. వేరే హీరోల దగుల్భాజీ ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్ల ఆట కట్టించడానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా ఆ ఛాలెంజ్ విసిరా’’ అంటూ వివరణ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత శ్రీరెడ్డి.. పవన్ బెడ్ పక్కన ఉన్నట్లుగా ఓ ఫొటోని క్రియేట్ చేసి.. వాట్.. ఇది నిజమేనా? అన్నట్లుగా ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు. మళ్లీ ఏమనుకున్నాడో.. కాసేపటికే ఆ ట్వీట్ తొలగించాడు. టోటల్‌గా మరోసారి పవన్ కల్యాణ్ పై వర్మ ట్విట్టర్ వేదికగా.. ఆడేసుకున్నాడు. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?. వారి స్టైల్లో వారు రెచ్చిపోయారు. పిచ్చి ఫ్యాన్స్.. వర్మ రెచ్చిగొట్టేదే అందుకు కదా.. అని వారు ఎప్పుడు తెలుసుకుంటారో.. ఏంటో?