Advertisementt

చైతూ సెలెబ్రేషన్స్ కి బ్రేక్

Sat 17th Apr 2021 11:43 AM
love story,naga chaitanya,sai pallavi,sekhar kammula,love story postponed,corona second wave,covid 19  చైతూ సెలెబ్రేషన్స్ కి బ్రేక్
Break for Chaitu Celebrations చైతూ సెలెబ్రేషన్స్ కి బ్రేక్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సాయి పల్లవి - శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ నిన్న ఏప్రిల్ 16 న విడుదల కావాల్సింది. మంచి ప్రమోషన్స్ తో లవ్ స్టోరీ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కరోనా సెకండ్ వెవ్ కారణం థియేటర్స్ 50 పర్సెంట్ సామర్థ్యం కారణంగా లవ్ స్టోరీ ని వాయిదా వేసింది టీం. మళ్ళీ పరిస్థితులు అనుకూలించాక సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని చెప్పింది. లేదంటే ఈపాటికి నాగ చైతన్య ఇంట సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలయ్యేవి. ఎందుకంటే లవ్ స్టోరీ పక్కా హిట్. సాయి పల్లవి సారంగ దారియా, చైతూ - పల్లవి కెమిస్ట్రీ, శేఖర్ కమ్ముల దర్శకత్వం అన్ని సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. కరోనా వలన చైతూ ఆ సెలెబ్రేషన్స్ ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

ఇక నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా అలా ఉంటే.. ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా లో నటిస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్స్ తో రొమాంటిక్ గా కనిపించబోతున్న నాగ చైతన్య ఈ సినిమాలో మహేష్ బాబు కి వీరాభిమానిగా కనిపిస్తాడట. ఇక థాంక్యూ తర్వాత నాగ చైతన్య బాలీవుడ్ కి వెళ్ళబోతున్నాడని.. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా లో ఓ పాత్రలో చైతూ కనిపించబోతున్నాడనే ప్రచారం జరగడమే కాదు.. చైతూ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించేసరికి అందరూ చైతూ బాలీవుడ్ ప్రయాణం కన్ ఫమ్ అయ్యింది అనే అన్నారు.

మరి చైతూ నెక్స్ట్ ఏమిటి అనే దానిపై ప్రస్తుతానికి అయిపోతే సస్పెన్స్ కొనసాగుతున్నా.. నాగ చైతన్య థాంక్యూ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా భార్య సమంత తో కలిసి ట్రెడిషనల్ ఫోటో షూట్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. నాగ చైతన్య - సమంతల ట్రెడిషనల్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

Break for Chaitu Celebrations:

Love Story makers postpone its release due to surge in Covid

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ