సమంత ఎంత గ్లామర్ గా ఉంటుందో.. బికినీ వేస్తె అంతే హాట్ గా ఉంటుంది. అలాంటి హీరోయిన్ డీ గ్లామర్ రోల్ లో ఊహించుకోవడానికే నచ్చదు. కానీ సమంత రామ లక్ష్మి పాత్రలో సుకుమార్ రంగస్థలంలో ఇరగదీసేసింది. డీ గ్లామర్ గా గేదెలను గోదావరిలో కడుగుతూ.. చేలో పంట పండిస్తూ.. గేదెలని మేపుతూ.. ఆరో క్లాస్ చదువుకున్న అమ్మాయిగా అదరగొట్టేసింది. మరి ఇప్పుడు మరో హీరోయిన్ ని సుకుమార్ డీ గ్లామర్ రోల్ లో చూపించబోతున్నాడు. ఇప్పటివరకు క్లాసీ లుక్ లో, చాలా స్టయిల్ గా, గ్లామర్ గా ఉండే రష్మిక మందాన్నని పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ లోనే చూపించబోతున్నాడు సుకుమార్. పుష్ప టీజర్ లో ఓ షాట్ లో రష్మిక లంగా ఓణీతో కనిపిస్తుంది.
అయితే తాజాగా రశ్మిక్ పుష్ప లో చెయ్యబోయే రోల్ పై ఓ న్యూస్ వినిపిస్తుంది. ఆమెది ఈ సినిమాలో గిరిజన గూడెంలో ఉండే అమ్మాయి పాత్ర. అయితే ఇంటర్వెల్ లో రష్మిక పాత్ర పై ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఆమె విలన్ తరుపున నుండి వచ్చిన ఎకౌంటెంట్ గా రివీల్ అవుతుందట. విలన్ కి సంబంధించిన ఎకౌంట్స్ చూస్తూ ఉంటుందని.. అలా రష్మిక పాత్ర విలన్ వైపు ఉండడడం వెనుక కూడా ఓ భారీ ట్విస్ట్ ఉంటుందట. మరి సుల్తాన్ లో పల్లెటూరి అమ్మాయిగా లుక్స్ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న రష్మికకి.. ఈ పుష్ప లో చేసే డీ గ్లామర్ పాత్ర ఏమైనా హెల్ప్ చేస్తుందో చూడాలి.