సమంత సినిమాల్లో గ్లామర్ గా టాప్ హీరోయిన్ గా తన స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్నా.. తాను మాత్రం సేవ దాతృకతని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత చిన్న పిల్లలకి ఉచిత ఆపరేషన్స్ లాంటివి చేయిస్తూ ఉంటుంది. అయితే తాజాగా సమంత ఆహా షో కి హోస్ట్ గా చేసింది. స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండ , చిరంజీవి, నాగ చైతన్య, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఆహా షో చేసిన సమంత ఆ షో లో కుటుంబ పోషణ కష్టంగా మారిన కొందరిని ఆదుకుంది. అందులో భాగంగా సమంత చేతుల మీదుగా ఓ ఆటో డ్రైవర్ కి స్విఫ్ట్ కారుని ప్రెజెంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
మాములు ఆటో డ్రైవర్ కి ఆటో బదులు స్విఫ్ట్ కారుని ఇవ్వడం పెద్ద విషయం కాకపోయినా.. ఆ ఆటో డ్రైవర్ ఓ అమ్మాయి కావడం ఇక్కడ హాట్ టాపిక్. చిన్నప్పుడే పెళ్లి చేసుకుని కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారిన అమ్మాయికి లాక్ డౌన్ లో బ్రతకడమే కష్టంగా మారిపోతే.. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని ఆ అమ్మాయికి ఫోన్ చేసి చేసి ఆహా షో కి రప్పించి ఆ షో ద్వారా సమంత ఆ అమ్మాయికి ఓ స్విఫ్ట్ కారుని ప్రెజెంట్ చేస్తున్నట్టుగా మాటిచ్చింది. ఇప్పుడు సమంత ఆ మాటని నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఆ కారు ఆ ఆటో డ్రైవర్ దగ్గరకి చేరడంతో ఇప్పుడు ఆ మేటర్ కాస్తా మీడియాలో న్యూస్ అయ్యింది.