నిన్నటివరకు కరోనా పాజిటీవ్ తో హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్న బాలీవుడ్ ప్రముఖులు.. ఇప్పుడు కరోనా నెగెటివ్ రావడంతో ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. అందులో ముందుగా రణబీర్ కపూర్, అలియా భట్ లు మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ నడుస్తున్న కారణంగా వెకేషన్స్ కోసం మాల్దీవులకు ట్రిప్ వేశారు. ముందుగా రణబీర్ కపూర్ కరోనా బారిన పడగా.. తర్వాత కొన్నాళ్ళకి అలియా భట్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో ఆమె హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయింది. దానితో అలియా భట్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్, సంజయ్ లీలా భన్సాలీ గంగూభాయ్ కతీయవాడి సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. అందులోనూ మహారాష్ట్ర సర్కార్ మహా జనతా కర్ఫ్యులో భాగంగా మహారాష్ట్రలో సినిమా షూటింగ్ లకి బ్రేకులు వెయ్యడంతో అన్ని సినిమాల షూటింగ్స్ ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
ఇక కరోనా బారిన పడి కోలుకున్న రణబీర్ కపూర్ ఈమధ్యన బయట కనిపిస్తూనే ఉన్నాడు.. అలియా భట్ కి కరోనా తగ్గగానే ఇద్దరూ కలిసి మాల్దీవులకు ఎంజాయ్ చెయ్యడానికి చెక్కేశారు. మాల్దీవుల్లో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ జంట ఈ రోజు ఉదయమే ముంబై ఎయిర్ పోర్ట్ నుండి మాల్దీవులకు వెళ్ళిపోయింది. అయ్యో కరోనా ఇలా తగ్గిందో లేదో.. ఎడబాటు తట్టుకోలేని ఈ జంట మాల్దీవులకు వెళ్ళింది అని అంటున్నారు ఇరువురి అభిమానులు. ఇక మాల్దీవులని నుండి వచ్చాక అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది.