ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందొ కానీ.. ప్రస్తుతం ప్రపంచం గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఇండియా లేదు. భారత దేరంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆ రేంజ్ లో ఉంది. ఫిబ్రవరి 15 నాటికే సెకండ్ వెవ్ ఇండియా ని కమ్మేసినా.. భారతదేశం దాన్ని అంతగా సీరియస్ గా తీసుకోలేదని WHO వాదిస్తుంది. అదలా ఉంటే ప్రస్తుతం ఇండియా లోని పలు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కారణంగా నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. మహా రాష్ట్రలో లాక్ డౌన్ కాకుండా మహా జనతా కర్ఫ్యూ విధించింది మహారాష్ట్ర సర్కార్. ఇక దేశ రాజధాని ఢిల్లీ కూడా కరోనా తో ఒణికి పోతుంది.
అక్కడ హాస్పిటల్ బెడ్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి, ఆక్సిజెన్ లేక కరోనా పేషేంట్స్ విలవిల్లాడుతున్నారు. అక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లో నైట్ కర్ఫ్యూ విధించినా కరోనా కంట్రోల్ కావడం లేదు. దానితో ఢిల్లీ సర్కార్ దేశ రాజధాని ఢిల్లీ లో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఆవరసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటిలోకి రావొద్దని.. లాక్ డౌన్ కఠినంగా అమలు జరుగుతుంది అని కేజ్రీవాల్ చెప్పారు. వలస కార్మికులు ఎక్కడకూ పోవద్దని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
అయితే ఈ ఆరు రోజుల లాక్ డౌన్ పొడిగించే పరిస్థితి రాకుడదని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. మరోపక్క దేశ ప్రధాని దేశం మొత్తం కరోనా ఆంక్షలు గట్టిగా అమలు చెయ్యాలని, అన్ని రాష్ట్రాల సీఎం లతో మోడీ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఈ సమావేశంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అని దేశమంతా ఎదురు చూస్తుంది.