Advertisementt

వెంకీ కూడా అలానే చేస్తాడా?

Mon 19th Apr 2021 09:04 PM
venkatesh,drishyam 2,drushyam 2,ott,directly,venky,meena,nadiya  వెంకీ కూడా అలానే చేస్తాడా?
Drushyam 2 to take the OTT route directly? వెంకీ కూడా అలానే చేస్తాడా?
Advertisement
Ads by CJ

రీమేక్ రాజా వెంకటేష్ ఇప్పటికే నారప్ప, దృశ్యం 2 షూటింగ్స్ పూర్తి చేసేసుకుని.. ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉందామనుకున్నాడు కానీ.. అనిల్ రావిపూడి కి కరోనా రావడంతో ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ ని వాయిదా వేసింది టీం. అయితే మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అద్భుతమైన హిట్ అయిన మోహన్ లాల్ దృశ్యం 2 సినిమాని ఆ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ తో వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దృశ్యం 2 రీమేక్ రైట్స్ కొన్న నెల లోగా ఆ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి షాకిచ్చారు వెంకీ. అటు అసురన్ రీమేక్ నారప్ప, ఇటు దృశ్యం 2 రీమేక్ లని వెంకీ లుంగ చుట్టి పడేసాడు.

అయితే మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 2 ని ఓటిటికి అమ్మేసినట్టుగా వెంకీ కూడా దృశ్యం 2 సినిమాని అంత ఫాస్ట్ గా చుట్టేసింది ఓటిటికి అమ్మెయ్యడానికే అనే టాక్ మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. ఇలాంటప్పుడు దృశ్యం 2 మూవీని థియేటర్స్ లో విడుదల చేసందుకు టైం పడుతుంది కాబట్టి.. దగ్గుబాటి బ్రదర్స్ ఇద్దరూ దృశ్యం 2 ని ఓటిటికి అమ్మేయ్యొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది చాలా సినిమాలు ఓటిటి లోనే విడుదలయినట్లుగా వెంకీ అండ్ సురేష్ బాబు లు కూడా దృశ్యం 2 ని ఓటీటీకి అమ్మేస్తారో.. లేదంటే థియేటర్స్ కోసం వేచి చూస్తారో జస్ట్ వెయిట్ అండ్ సి.

Drushyam 2 to take the OTT route directly? :

Venkatesh Drushyam 2 to take the OTT route directly? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ