Advertisementt

చిరు ఆచార్య షూటింగ్ కి బ్రేకులు

Tue 20th Apr 2021 10:43 AM
chiru,acharya,koratala,corona second wave,acharya movie,may 13 release  చిరు ఆచార్య షూటింగ్ కి బ్రేకులు
Break for Acharya movie shooting చిరు ఆచార్య షూటింగ్ కి బ్రేకులు
Advertisement
Ads by CJ

చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ పై అటు మార్కెట్ లోనూ ఇటు ఫాన్స్ లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. మరో 20 రోజుల్లో రిలీజ్ కి సిద్ధం అనుకుంటున్న చిరు ఆచార్య సినిమా షూటింగ్ కి బ్రేకులు పడడం మెగా ఫాన్స్ లో ఆందోళన కలిగిస్తుంది. మే 13 న రిలీజ్ డేట్ ప్రకటించిన ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఆచార్య షూటింగ్ లోనే నటుడు సోను సూద్ కరోనా బారిన పడడంతో.. ఆయన హోమ్ ఐసోలేషన్ కి వెళ్లినా ఆచార్య షూటింగ్ చేసారు కొరటాల. అయితే ఇప్పుడు చిరు మాత్రం ఆచార్య షూటింగ్ కొన్నిరోజులు ఆపేద్దాం.. ఈ సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో సినిమా అనుకున్న టైం కి పూర్తవడం కష్టం. 

ఎలాగూ రిలీజ్ టైం కి ఆచార్య ని తీసుకురావడం కుదరదు.. అందుకే అరిబరిగా షూటింగ్ చెయ్యడం ఎందుకు.. ఈ కరోనా సెకండ్ వెవ్ సిట్యువేషన్ లో షూటింగ్ చెయ్యడం అంత మంచిది కాదని కొరటాలకి చిరు చెప్పడంతో ఆచార్య షూటింగ్ ని ఆపేసినట్లుగా తెలుస్తుంది. ఆచార్యలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ సాంగ్ చిత్రీకణ చెయ్యాల్సి ఉందట. గత ఏడాది కరోనా రాగానే చిరు నే ముందుగా తన సినిమా షూటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. తర్వాత లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మరి ఇప్పుడు కూడా ఆచార్య షూటింగ్ అందరికన్నా ముందే చిరునే ప్యాకప్ చెప్పేసారు. 

Break for Acharya movie shooting:

Acharya breaks into shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ