Advertisementt

జబర్దస్త్ బ్యూటీకి కరోనా- పరిస్థితి ఘోరం

Tue 20th Apr 2021 12:57 PM
jabardasth varsha,corona second wave,corona virus,varsha tested positive,covid 19  జబర్దస్త్ బ్యూటీకి కరోనా- పరిస్థితి ఘోరం
Jabardasth Varsha tested positive for Covid 19 జబర్దస్త్ బ్యూటీకి కరోనా- పరిస్థితి ఘోరం
Advertisement
Ads by CJ

జబర్దస్త్ హాట్ యాంకర్ గా అనసూయ చక్రం తిప్పుతుంది. మరోపక్క ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ కూడా గ్లామర్ గా అదరగొట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరికి పోటీనా అన్నట్టుగా సీరియల్ నటి వర్ష జబర్దస్త్ లో గ్లామర్ గా దుమ్ములేపుతుంది. కెవ్వు కార్తీక్ టీం ద్వారా జబర్దస్త్ కి పరిచయం అయిన వర్ష.. అదే టీం లో మరో కమెడియన్ ఇమ్మాన్యువల్ తో సం సం థింగ్ అంటూ బాగా హైలెట్ అవుతుంది. ఒక పక్క గ్లామర్ షో మరో పక్క ఇమ్ము లవ్ స్టోరీతో చాలా త్వరగా పాపులర్ అయిన ఈ బ్యూటీకి కరోనా రావడం హాట్ టాపిక్ గా మారింది. మహా మహులే కరోనా బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు.. ఇదేం పెద్ద విషయం అనుకునేరు. వర్ష చెప్పింది వింటే అమ్మ బాబోయ్ అంటారు.

వర్ష బయట కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ఘోరంగా ఉందొ చెబుతుంది. సోషల్ మీడియాలో లైవ్ లోకొచ్చిన వర్ష.. నేను ఇలా లైవ్ లోకి రావడం ఆశ్చర్యం అనిపించినా.. రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగా లేదు. మరి అంత సీరియస్ గా ఏమీ అనిపించలేదు కానీ.. కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కానీ బయట పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే.. ఇక్కడ జరిగింది ఎవరికి తెలియదు. చూస్తే భయపడిపోతారు. కరోనా తో చనిపోయిన వారిని ప్యాక్ చేసి పడేస్తున్నారు. అది చూడగానే మీకు చెప్పాలని అనిపించి ఇలా లైవ్ లోకి వచ్చాను. అందరూ జాగ్రత్తగా ఉండండి.. అంటూ బయట పరిస్థితిని వర్ష ఇలా లైవ్ చాట్ ద్వారా తెలియజేసింది.

Jabardasth Varsha tested positive for Covid 19:

I have tested positive for coronavirus, says Jabardasth Varsha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ