Advertisementt

జబర్దస్త్ రాకేష్ ముందే అలెర్ట్ అయ్యాడు

Thu 22nd Apr 2021 11:12 AM
jabardasth,rocking,rakesh,request,parents,face book video  జబర్దస్త్ రాకేష్ ముందే అలెర్ట్ అయ్యాడు
Jabardasth Rakesh Request to parents జబర్దస్త్ రాకేష్ ముందే అలెర్ట్ అయ్యాడు
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం టిక్ టాక్ స్టార్ భార్గవ్ చిప్పాడ తనలాగే అమ్మాయిలని సెలబ్రిటీస్ ని చేస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ చేతిలో ఎప్పటికప్పుడు చాలామంది మోసపోతూనే ఉంటారు. సినిమా అవకాశాల కోసం బ్రోకర్స్ ని నమ్మి అటు వ్యక్తిగతంగానూ, ఇటు ఆర్థికంగానూ మోసపోతున్న సందర్భాలు కోకోల్లలు. అయితే భార్గవ్ చిప్పాడ కేసు తర్వాత జబర్దస్త్ రాకేష్ ముందుగా అలెర్ట్ అయ్యి.. ఇలా జబర్దస్త్ అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు.

ఎందుకంటే తన టీం ద్వారా చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు జబర్దస్త్ లోకివచ్చి ఇప్పుడు పాపులర్ అయ్యారు. దీవెన, యోదా, నిఖిల్ లాంటి పిల్లలు జబర్దస్త్ లో ఎంత బాగా పెర్ఫర్మ్ చేస్తూ సెలబ్రిటీస్ అయ్యారో చూసిన చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని జబర్దస్త్ కి పంపి రాకేష్ టీం ద్వారా పాపులర్ అయితే బావుండు అనే ఆలోచనతో కొంతమంది దళారులని సంప్రదిస్తున్నారని తెలుసుకున్న రాకేష్ ఇలాంటివి చెయ్యొద్దు.. తన పేరు చెప్పి కొంతమంది పిల్లలని సెలబ్రిటీస్ ని చేస్తామని మోసం చేస్తూ డబ్బు గుంజుతున్నారని, దయచేసి ఇలాంటి వారి వల్ల మోసపోకండి అంటూ రాకేష్ ఫేస్ బుక్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అవకాశం ఇచ్చేవాడు డబ్బు అడగడు.. మీ అవకాశాలు మీరే ఎతుక్కోండి అంటూ రాకేష్ అందరిని ఫేస్ బుక్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. రాకేష్ చెప్పడం కాదు కానీ.. సెలబ్రిటీస్ అవుదాలనుకునే భ్రమలో చాలామంది ఇలానే మోసపోతున్నారు. 

Jabardasth Rakesh Request to parents:

Jabardasth Rocking Rakesh Request to parents

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ