Advertisementt

హోమ్ ఐసోలేషన్ కి సూపర్ స్టార్ మహేష్

Thu 22nd Apr 2021 05:49 PM
mahesh babu,self isolates,personal stylist,tested positive,covid19  హోమ్ ఐసోలేషన్ కి సూపర్ స్టార్ మహేష్
Mahesh Stylist Tests Positive for Covid 19 హోమ్ ఐసోలేషన్ కి సూపర్ స్టార్ మహేష్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా సెకండ్ వెవ్ అందరిని వణికిస్తుంది. ఒకపక్క ఆక్సిజెన్ కొరత, మరోపక్క హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రమో ఈ కరోనా వలన బాధపడడం లేదు.. అన్ని రాష్ట్రాల్లో కొరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలంగా ఉంది. పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. ఇక తెలంగాణాలో థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమాలన్ని వాయిదా పడినా.. ప్రస్తుతం షూటింగ్స్ అయితే నడుస్తున్నాయి. ఏ ఒక్క షూటింగ్ లో కరోనా కలకలం రేగినా.. ఆ షూటింగ్ కి ప్యాకప్ చెబుతున్నారు మూవీ యూనిట్. మొన్న పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఆయన నటిస్తున్న రెండు సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కారణం ఆయన స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తుగా మహేష్ హోమ్ ఐసొలేట్ అయ్యాడు. మహేష్ ని స్టయిల్ గా చూపించే పర్సనల్ స్టైలిస్ట్ ఇలా కరోనా బారిన పడడంతో మహేష్ బాబు అలెర్ట్ అయ్యి.. ముందు జాగ్రత్తగా ఆయన ఇంట్లోనే మహేష్ హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిపోయారు. ఇప్పటికే సర్కారు వారి పాట చిత్ర బృందంలో నలుగురికి కరోనా సోకడంతో ఆ షూటింగ్ వాయిదా పడింది అనే న్యూస్ ఉంది. ఇప్పుడు మహేష్ హోమ్ ఐసోలేషన్ కి వెళ్లడంతో మరోసారి ఈ సినిమా షూటింగ్ ఆగినట్లుగా తెలుస్తుంది. ఇక ట్విట్టర్ లో #StaySafeMaheshAnna అనే హాష్ తో మహేష్ ఫాన్స్ చెలరేగిపోయి ట్వీట్స్ చేస్తున్నారు.

Mahesh Stylist Tests Positive for Covid 19:

Mahesh Babu has self isolates himself in after his personal stylist tested positive for COVID19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ