ఏపీ లో వైసిపి పార్టీ అధికారం చేపట్టాక.. ప్రతి పక్షం లేకుండా చెయ్యాలనే వైసిపి ప్రభుత్వం కుట్ర చేస్తుంది అని టీడీపి నేతలు ఎప్పటినుండో మొత్తుకుంటున్నట్టుగానే.. జగన్ ప్రభుత్వం టిడిపి నేతలను వరసగా అరెస్ట్ లతో భయపెట్టేస్తుంది. టీడీపీ పార్టీ అనేదే లేకుండా చెయ్యాలని వైసిపి ప్రభత్వం కంకణం కట్టుకున్నట్టుగా కేవలం టిడిపి నేతలనే అరెస్ట్ లు చెయ్యడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. గత ఏడాది కోవిడ్ టైం లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రెండు నెలలు ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం మళ్ళీ అదే కరోనా టైం లో లో టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ని గుంటూరు జిల్లా చింతలపూడిలో ఆయన నివాసం వద్ద అరెస్ట్ చెయ్యడం కలకలం రేపింది.
అచ్చెన్నాయుడు అరెస్ట్ ఎలా అయితే జరిగిందో.. తెల్లవారి ఝామున అచ్చెన్నాయుడు ఇంటి మీదకెళ్ళి పోలీస్ లు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్టుగానే ఈ రోజు తెల్లవారగానే నరేంద్ర ని ఆయన నివాసం వద్దే ఓ 100 మంది పోలీస్ లు అరెస్ట్ చేసారు. అయితే దూళిపాళ్ల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు పాల్పడిన కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా ఏసిబి చెబుతుంది. గతంలో కూడా దూళిపాళ్ళపై కేసులు వెయ్యగా ఆయన కోర్టుకి వెళ్లారు. ఇప్పుడు కొత్త కేసు పెట్టి అరెస్ట్ చేసింది ఏసిబి. అస్సైన్డ్ భూముల్లో సిఐడి కేసు నేతల కుట్రని బయటపెట్టినందుకుకే నరేంద్ర దూళిపాళ్ళని వైసిపి ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.