గతంలో సౌత్ ని ఊపేసిన సన్నజాజి నడుమందం ఇలియానా కి ఇప్పుడు అడుక్కున్నా అవకాశాలు రావడం లేదనే టాక్ ఉంది. బాలీవుడ్ లో జెండా పాతేస్తా అంటూ బయలు దేరి సౌత్ ని నిర్లక్ష్యం చేసిన ఇలియానా కి బాలీవుడ్ షాకివ్వలేదు. ఇలియానా ప్రేమే ఆమె పాలిట శాపంగా మరింది. బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా కి ఆ లవ్ బ్రేకప్ అవడంతో మానసికంగా కుంగిపోయి.. బరువెక్కింది. దానితో ఇలియానా ని పట్టించుకున్న దర్శకనిర్మాతలు లేరు. మళ్ళీ సినిమాల్లోకి కం బ్యాక్ అయినా ఇలియానా కి టైం కలిసి రావడం లేదు. అయితే ఇలియానా కి సినిమాలు తగ్గడానికి కారణం ఆమె బరువు, ఆమె లక్కు కారణం కాదట.
ఇలియానాకి సినిమాలు తగ్గడానికి తానే కారణమట. ఎలా అంటే.. ఇలియానా దగ్గరకి చాలా కథలు వస్తున్నాయట, కానీ ఇలియానా మాత్రం ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటుంది. అందులోనూ ఇలియానాకి రొటీన్ సినిమా చెయ్యాలంటే ఇష్టం లేదట. ఏది పడితే అది చెయ్యలేకే ఇలియానా ఇలా ఖాళీగా కూర్చుందట. కాకపోతే ఓ పూర్తి స్థాయి యాక్షన్ ఫిలిం లో నటించాలనేది ఈ గోవా బ్యూటీ కోరికగా చెబుతుంది. ఇప్పటివరకు గ్లామర్ షో చేసిన ఇలియానా కి ఇక అది వర్కౌట్ అవ్వదని తెలిసినట్టుగా ఉంది. అందుకే ఇలా యాక్షన్ ఫిలిం అంటుంది. మరి ఇలియానా కి ఆ యాక్షన్ ఫిలిం ఛాన్స్ ఎవరిస్తారో.. ఆమె కోరిక ఎవరు తీరుస్తారో చూడాలి.