Advertisementt

ఏది ఎలా ఉన్నా సూపర్ స్టార్ ఆగడం లేదు

Sat 24th Apr 2021 10:56 AM
rajinikanth,action sequence,annaatthe movie,director shiva,ramoji film city  ఏది ఎలా ఉన్నా సూపర్ స్టార్ ఆగడం లేదు
Rajinikanth is back in action ఏది ఎలా ఉన్నా సూపర్ స్టార్ ఆగడం లేదు
Advertisement
Ads by CJ

కరోనా తో ఏకంగా 24 సినిమాల షూటింగ్ లు పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కారణముగా టాలీవుడ్ లో చాలా సినిమాల షూటింగ్స్ మూలపడ్డాయి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఏది ఏమైనా అన్నాత్తే షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం లేదు. గత ఏడాది డిసెంబర్ లో సూపర్ స్టార్ ఆరోగ్య రీత్యా మూడు నెలల షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యి.. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యుల్ తో షూటింగ్ మొదలవ్వగా దర్శకుడు శివ అన్నాత్తే షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. కరోనా తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రజినీకాంత్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. 24/7 డాక్టర్స్ పర్యవేక్షణలో అన్నాత్తే షూటింగ్ జరుగుతుంది. 

రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో అన్నాత్తే షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మీద యాక్షన్స్ సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు దర్శకుడు శివ. ఓ 40 లారీలు, భారీ ట్రక్కులతో సూపర్ స్టార్ రజిని ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో దుమ్మురేపుతున్నారట. రజినీకాంత్ తన మార్క్ స్టయిల్ తో ఈ యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టేస్తున్నారని తెలుస్తుంది. ఓ పెద్ద బంగాళా, ఆ బంగ్లా ముందు పెద్ద ప్లేస్.. అందులో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చెప్పట్టారట. యాక్షన్ కొరియోగ్రాఫేర్ దిలీప్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుంది.

Rajinikanth is back in action:

Rajinikanth action sequence in Annaatthe

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ