మంత్రి కేటీఆర్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా ట్వీట్ చెయ్యడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ.. చాలామంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే.. మంచు లక్ష్మి మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.. కేటీఆర్ గారు.. Get well soon buddy .. watch my all movies అంటూ ట్వీట్ చేసింది.
దానికి కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చినట్టుగా ఇప్పుడొక మీమ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. I need rest, not Punishment అంటూ కేటీఆర్ ఫన్నీ గా రిప్లై ఇచ్చినట్టుగా మీమ్స్ చేసారు. అంటే లక్ష్మి మంచు మూవీస్ చూసిన వారికి పనిష్మెంట్ తప్పదన్నట్టుగా కేటీఆర్ మంచు లక్ష్మి ట్వీట్ కి రిప్లై ఇచ్చినట్టుగా ఆ మీమ్ క్రియేట్ చేశారన్నమాట. ఇప్పుడా మీమ్ ఫన్నీగా అనిపించడమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.