అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప మూవీ షూటింగ్ ఆగలేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగ్స్ కి బ్రేకులు పడినా సుక్కు మాత్రం పుష్ప షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ పుష్ప కి పెట్టిన టార్గెట్ ఆగష్టు 13 న రీచ్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చెయ్యబోయే ప్రాజెక్ట్ పై అందరిలో ఆశక్తి నెలకొంది. అసలైతే అల్లు అర్జున్ పుష్ప తర్వాత కొరటాల శివ తో పాన్ ఇండియా మూవీ ని కాన్సెప్ట్ పోస్టర్ తో సహా ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొరటాల - అల్లు అర్జున్ మధ్యలోకి ఎన్టీఆర్ రావడంతో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉంది. అదెలా ఉన్నా అల్లు అర్జున్ వకీల్ సాబ్ సక్సెస్ జోష్ లో ఉన్న దిల్ రాజు - వేణు శ్రీరామ్ కాంబోలో ఐకాన్ పట్టాలెక్కిస్తాడేమో అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఐకాన్ పై పెదవి విప్పడం లేదు.
దానితో అల్లు అర్జున్ పుష్ప తర్వాత మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తాడు కానీ ఐకాన్ చెయ్యడని ఫిక్స్ అవుతున్నారు ఫాన్స్. ఈమధ్యన అల్లు అర్జున్ కి కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి హైదరాబాద్ గీత ఆర్ట్స్ ఆఫీస్ లో మీటింగ్ జరిగినట్టుగా టాక్ బయటికి వచ్చింది. అల్లు అర్జున్ - ప్రశాంత్ నీల్ మధ్యన కథా చర్చలు జరిగినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బన్నీ పుష్ప తర్వాత ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చెయ్య బోతున్నాడంటున్నారు. అందుకే కొరటాల ఎన్టీఆర్ సైడ్ కి వెళ్ళినా అల్లు అర్జున్ ఫీలవ్వలేదని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తర్వాత ప్రభాస్ తో సలార్ పూర్తి చేసేసి అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ చేస్తాడని.. అల్లు అర్జున్ కూడా పుష్ప తర్వాత చిన్నపాటి గ్యాప్ తో ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు.