దేశం మొత్తం కరోనా కేసులు, కరోనా రోగుల ఆర్తనాదాలు. ఆక్సిజెన్ అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. కరోనా కట్టడి కావడం లేదు. ప్రధాని మోడీ ని ఆక్సిజెన్ కోసం, హాస్పిటల్ బెడ్స్ కోసం కేజ్రీవాల్ వేడుకుంటున్నారు. మరోపక్క ఢిల్లీ లో గత ఆరు రోజులుగా లాక్ డౌన్ అమలు చేస్తుంది ప్రభుత్వం. లాక్ డౌన్ లో అన్ని మూతపడ్డాయి.. అయితే ఈ రోజుతో ఢిల్లీ లో లాక్ డౌన్ ముగియనుంది. కరోనా మాత్రం కట్టడి కాలేదు.
అందుకే సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లో లాక్ డౌన్ కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. మే 3 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అంటే మరో వారం రోజుల పాటు ఢిల్లీ లో లాక్ డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ కానున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ భయంతో వలస కూలీలు ఢిల్లీ ని వదిలి పెట్టారు. కరోనా కేసులు కట్టడి కాకపోతే ఇలా లాక్ డౌన్ పెంచుకుంటూ పోవడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు.