ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా ఫెమస్ అయిన విశ్వక్ సేన్ హిట్ సినిమా తో హిట్ కొట్టి ప్రస్తుతం పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయినా.. కరోనా సెకండ్ వేవ్ అడ్డం పడింది. ఇప్పటికే విశ్వక్ సేన్ పాగల్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసాడు. పాగల్ తర్వాత ఓమై కడవలే తమిళ సినిమాని రీమేక్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఆ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా తాజాగా అభిమానులతో జరిగిన చిట్ చాట్ లో బయట పెట్టాడు. కరోనా సెకండ్ వేవ్ గురించి మట్లాడమంటే.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన విశ్వక్ ని ఓ నెటిజెన్.. మీ క్రష్ ఎవరు భయ్యా అని అడగగా.. దానికి విశ్వక్ సేన్ నా క్రష్ ఇలియానా. అప్పుడూ ఇప్పుడూ ఎప్పటికి ఇలియానానే అంటూ గోవా సుందరి పేరు చెప్పాడు.
ఇక లాక్ డౌన్ ముందు తక్కువగా పడుకుని.. పని గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని.. కానీ లాక్ డౌన్ తర్వాత నిద్ర పోయి ఆరోగ్యంగా ఉంటేనా కదా.. పని చేయగలుగుతాం, అలాగే పని గురించిన టెంక్షన్ కూడా తగ్గించుకోవాలనేది తెలుసుకున్నాను అని చెబుతున్నాడు విశ్వక్ సేన్. పాగల్ సినిమా ట్రైలర్ గురించి అడిగితే నాకు మీ అందరికి పాగల్ ట్రైలర్ చూపించాలని ఉన్నా.. కరోనా అడ్డం పడుతుంది. ఇక పాగల్ రిలీజ్ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకి కరోననే సమాధానం చెప్పాలి అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. పెళ్ళెప్పుడు అని అడిగిన నెటిజెన్ కి సంబంధాలు ఎమన్నా ఉంటే చెప్పండి భయ్యా అంటూ వాళ్ళకే తిరిగి ప్రశ్న వేసాడు విశ్వక్ సేన్.