Advertisementt

మాల్దీవుల వెకేషన్స్ ముగించేశారు

Sun 25th Apr 2021 08:32 PM
alia bhatt,ranbir kapoor,disha patani,tiger shroff,maldives,holiday,corona,pandemic  మాల్దీవుల వెకేషన్స్ ముగించేశారు
Bollywood Celebrities back home amid online flak for Maldives holiday during pandemic మాల్దీవుల వెకేషన్స్ ముగించేశారు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా కరోనా పాజిటివ్స్ తో హోమ్ ఐసోలేషన్ కే పరిమితమయ్యారు. ఇక కరోనా నెగెటివ్ రాగానే ఇంట్లో ఉండి బోర్ కొట్టిన సెలబ్రిటీస్ అందరూ మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ తో హోటల్స్, రిసార్ట్స్ మూత బడడంతో.. ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు చెక్కేశారు చాలామంది సెలబ్రిటీస్. అందులో బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అలియా భట్ - రణబీర్ కపూర్ లు దిశా పటాని - టైగర్ షరాఫ్ లు ఉంటే.. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి వాళ్ళు వెకేషన్స్ కి మాల్దీవులకు వెళ్లిన సెలబ్రిటీస్ లో ఉన్నారు.

అయితే వారం క్రితం మాల్దీవులకు వెళ్ళిన వీరంతా.. అక్కడ బీచ్ వెంట బికినీలతో చేసిన ఎంజాయ్మెంట్ ని ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంపై చాలా విమర్శలు వచ్చాయి. కరోనా తో దేశం అల్లకల్లోలం అవుతుంటే.. సెలబ్రిటీస్ కి వెకేషన్స్ అవసరమా? ఇలా ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం అవసరమా? అంటూ నెటిజెన్స్ దగ్గరనుండి, చాలామంది సెలబ్రిటీస్ వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడూ మాల్దీవులకు వెళ్లిన సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా తిరిగి ముంబై చేరుకున్నారు. ఈ రోజు సండే అలియా భట్ - రణబీర్ కపూర్, దిశా పటాని - టైగర్ షరాఫ్ లు ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం వాళ్ళు తిరిగి ముంబై చేరుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bollywood Celebrities back home amid online flak for Maldives holiday during pandemic:

Alia Bhatt-Ranbir Kapoor, Disha Patani-Tiger Shroff are back home amid online flak for Maldives holiday during pandemic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ