గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలవడంతో థియేటర్స్ అన్నీ దాదాపుగా తొమ్మిదినెలల పాటు మూత పడడంతో ఓటిటి సంస్థలు చెలరేగిపోయాయి. థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి అవకాశం లేని వారు చాలామంది తమ సినిమాలను ఓటిటీలకి విక్రయించేసారు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు చాలా ఓటిటి నుండి నేరుగా విడుదలయ్యాయి. ఇక ఈ ఏడాది థియేటర్స్ ఓపెన్ అవడంతో ఓటిటీలు మూగబోయినా.. మరోసారి కరోనా లాక్ డౌన్ లేకపోయినా థియేటర్స్ మూత బడడంతో ఓటిటి ల టైం స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ ఫైవ్, ఆహా వంటి ఓటిటీలు చిన్న, పెద్ద సినిమాలను కొనెయ్యడానికి తయారైపోయాయి.
ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే సిట్యువేషన్ కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి లో థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ఇలాంటి సిట్యువేషన్ లో సినిమాలను కొంతమంది ఓటిటికి అమ్మడం తప్ప వేరే దారి లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సినిమాల వెంట పడుతున్నాయి ఓటిటి సంస్థలు. నాని టక్ జగదీశ్ కి ఓటిటి నుండి భారీ ఆఫర్స్ వెళుతున్నాయి. మరోపక్క సందీప్ కిషన్ గల్లీ రౌడీ, తేజ ఇష్క్, ఎస్ ఆర్ కల్యాణమండపం, పాగల్ లాంటి సినిమాల దర్శకనిర్మాతలతో ఓటిటి సంస్థలు బేరాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఓటిటీలకి పెద్ద సినిమాలు కొనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే బాలయ్య అఖండ, చిరు ఆచార్య, లాంటి సినిమాల షూటింగ్స్ ఇంకా షూటింగ్స్ చిత్రీకరణ మిగిలే ఉంది.