చిరంజీవి - కొరటాల కాంబోలో మొదలైన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి ఓ గెస్ట్ రోల్ రాసుకున్న కొరటాల.. రామ్ చరణ్ క్రేజ్ దృష్ట్యా ఆచార్య లో రామ్ చరణ్ రోల్ ని ఓ 30 నిముషాలు నిడివి ఉండేలా పెంచేసాడు. ఆ 30 నిమిషాల చరణ్ రోల్ కి ఓ డ్యూయెట్ అలాగే ఓ టాప్ హీరోయిన్ తీసుకున్నాడు. ఆచర్యలో సిద్ద పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే నీలాంబరి పాత్ర చేస్తుంది. పూజ హెగ్డే - రామ్ చరణ్ ఎపిసోడ్ ఆచార్యకి కీలకం కానుందట. చరణ్ -పూజ ఎపిసోడ్ లో ముందుగా చరణ్ పాత్ర రివీలవుతుంది అని.. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ లో పూజ హెగ్డే కేరెక్టర్ ని రివీల్ చేస్తారట.
రామ్ చరణ్ తన ఫ్లాష్ బాగ్ ఎపిసోడ్ రివీల్ చేసినప్పుడు పూజ హెగ్డే కేరెక్టర్ ఆచర్యలో ఎంట్రీ ఇస్తుందట. పూజ - చరణ్ ఎపిసోడ్ ఆచార్య కథకి చాలా కీలకమట. ఇక చరణ్ - చిరు కాంబో సీన్స్ కూడా సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని, రామ్ చరణ్ - పూజ కాంబో తెరపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించడం ఖాయమంటున్నారు. నక్సలైట్స్ గా చిరు - రామ్ చరణ్ ల పాత్రలు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదా పడగా.. ఇక సినిమా రిలీజ్ కూడా మే 13 నుండి ఆగష్టు 22 కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా టాక్.