అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో లో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ లో జరుగుతుంది. కరోనా నిబంధనల మధ్యన పుష్ప సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. కరోనా తో చాలా సినిమాలు షూటింగ్స్ వాయిదాలు పడిపోయినా పుష్ప షూటింగ్ మాత్రం ఆగలేదు. ఆఖరికి హీరోయిన్ రష్మిక కూడా హైదరాబాద్ లో పుష్ప యూనిట్ కి అందుబాటులో ఉంది. తాజాగా రష్మిక పుష్ప షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అభిమానులతో ముచ్చటించింది. సుకుమార్ సర్, అల్లు అర్జున్ తో వర్క్ చెయ్యడం కన్నా ఆనందం ఏముంటుంది అంటుంది.
అన్ని కరోనా నిభందనలు పాటిస్తూ పుష్ప షూటింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లో పుష్ప షూటింగ్ జరుగుతుందని చెప్పిన రష్మిక.. అల్లు అర్జున్ గురించి ఒక్కమాట చెప్పండి అనగానే.. అల్లు అర్జున్ స్వీట్ అండ్ సింపుల్ అని చెప్పింది. పుష్ప సినిమా చూడగానే మీరు ప్రేమలో పడిపోతారని సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇంకా మీరు చాలా క్యూట్ గా ఉన్నారని అభిమానులు మెచ్చుకోగా.. వాళ్ళకి థాంక్స్ చెప్పింది రష్మిక. ప్రస్తుతం అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.