రజినీకాంత్ - శివ కాంబోలో తెరకెక్కుతున్న అన్నాత్తే షూటింగ్ కి ఎలాంటి ఆటంకాలు లేకుండా రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్ లో జరుగుతుంది. గత ఏడాది సూపర్ స్టార్ హెల్త్ ఇష్యుస్ కారణంగా వాయిదా పడిన అన్నాత్తే సినిమా షూటింగ్.. రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలయ్యింది. రజినీకాంత్ గనక గత ఏడాది ఆరోగ్యపరమైన కారణాలు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఉంటే.. ఈ సినిమా వేసవిలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు దివాళి కి విడుదల డేట్ ఫిక్స్ చేసారు.
దానితో రజినీకాంత్ అన్నాత్తే షూటింగ్ త్వరగా కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో షూటింగ్ కి హాజరవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భీభత్సంగా, విపరీతంగా ఉన్న టైం లో రజినీకాంత్ అన్నాత్తే షూటింగ్ కి హాజరవడంతో ఆయన అభిమానులు టెంక్షన్ పడుతున్నారు. దర్శకుడు శివ డాక్టర్స్ ప్రయవేక్షణలో అన్నాత్తే షూటింగ్ కి గ్యాప్ ఇవ్వడం లేదు. తాజాగా చెన్నై నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు నయనతార కూడా వచ్చేసింది. స్పెషల్ ఫ్లైట్ లో నయనతార హైదరాబాద్ కి వచ్చి అక్కడినుండి అన్నాత్తే షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయింది. కరోనా తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నా.. తమిళనాడులో మినీ లాక్ డౌన్ నడుస్తున్న టైం లో రజినీకాంత్ - నయన్ ఇలా షూటింగ్ కి హాజరవడంపై అభిమానులు అందోళనగానే ఉన్నారు.