Advertisementt

వకీల్ సాబ్ స్ట్రీమింగ్.. దిల్ రాజుకి నోటీసులు

Thu 29th Apr 2021 01:28 PM
dil raju,vakeel saab,big legal trouble,vakeel saab movie,ott,online streaming,amazon prime  వకీల్ సాబ్ స్ట్రీమింగ్.. దిల్ రాజుకి నోటీసులు
Dil Raju Big Legal Trouble? వకీల్ సాబ్ స్ట్రీమింగ్.. దిల్ రాజుకి నోటీసులు
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 9 న థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ మూవీ కేవలం 21 రోజులకే ఆన్ లైన్ లో రిలీజ్ కాబోతుంది. కరోనా క్రైసిస్ కారణంగా థియేటర్స్ మూతబడడంతో వకీల్ సాబ్ మూవీని నిర్మాత దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు ఒప్పుకున్నాడు. థియేటర్స్ లో సినిమా విడుదలైన 50 రోజులకి ఆ సినిమా ఆన్ లైన్ లో రిలీజ్ అయ్యేలా ప్రొడ్యూసర్ గిల్డ్ ఒప్పందాలు చాలానే జరిగాయి. కానీ ఇప్పుడు దిల్ రాజు సినిమా విడుదలైన 21 రోజులకే తన సినిమాని ఆన్ లైన్ రిలీజ్ చేయడంపై ఇప్పుడు రాజుకి నోటీసులు రాబోతున్నాయట.

వకీల్ సాబ్ ఓవర్సీస్ హక్కులు కొన్న దుబాయ్ కు చెందిన ఫార్స్ కంపెనీ వారు ఇప్పుడు ఆ సినిమాని ఓటిటి లో రిలీజ్ చేసే విషయమై దిల్ రాజుకి నోటీసులు పంపబోతుందట. కారణం ఆ వకీల్ సాబ్ యుఎస్ హక్కులు విక్రయించినప్పుడు దిల్ రాజు.. మా సినిమా థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల లోపు ఎలాంటి ఓటిటి నుండి రిలీజ్ చెయ్యమని అగ్రిమెంట్ రాసిచ్చేసాడట. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో రేపు రిలీజ్ కాబోతుంది. దానితో ఆ దుబాయ్ కు చెందిన ఫార్స్ కంపెనీ దిల్ రాజు మీద కేసు వెయ్యడానికి రెడీ కాబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. పాపం దిల్ రాజు వకీల్ సాబ్ సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యకముందే ఈ కోర్టు, కేసులు, నోటీసు లతో సఫర్ అవుతున్నాడన్నమాట.

Dil Raju Big Legal Trouble?:

Dil Raju Big Legal Trouble With Vakeel Saab

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ