Advertisementt

చెక్ ఎక్సపీరియెన్స్ చాలలేదా నితిన్

Thu 29th Apr 2021 09:57 PM
nithin,director mahi v raghav,nithin check movie,rang de movie,love stories,maestro movie,power peta pan india movie  చెక్ ఎక్సపీరియెన్స్ చాలలేదా నితిన్
Nithin - Mahi V Raghav combo on cards? చెక్ ఎక్సపీరియెన్స్ చాలలేదా నితిన్
Advertisement
Ads by CJ

హీరో నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో బ్యూటిఫుల్ హిట్ కొట్టాడు. తర్వాత మళ్లీ లవ్ స్టోరీ రంగ్ దే సినిమాని మొదలు పెట్టాడు. అయితే రంగ్ దే కన్నా ముందే చందు మొండేటితో ఓ ఎక్సపెరిమెంటల్ మూవీ చెక్ చేసాడు. ఆ సినిమా నితిన్ కి అనుకున్న కమర్షియల్ హిట్ అవ్వలేదు. అది నిజంగా ఎక్సపెరిమెంటల్ మూవీగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రంగ్ దే తో కలర్ ఫుల్ హిట్ కొట్టాడు. అయితే రంగ్ దే లాస్ట్ లవ్ స్టోరీ అంటూ చెప్పి షాకిచ్చాడు. నితిన్ షాకివ్వడం కాదు.. నిజంగానే లవ్ స్టోరీస్ కి నితిన్ ఫుల్ స్టాప్ పెట్టేసాడనిపిస్తుంది.

ప్రస్తుతం నితిన్ అన్నట్టుగానే లవ్ స్టోరీస్ ని పక్కనబెట్టి మ్యాస్ట్రో అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత పవర్ పేట అనే పాన్ ఇండియా మూవీ ని లైన్ లో పెట్టిన నితిన్ ఆ సినిమాని కూడా డిఫరెంట్ స్టోరీతో చేస్తున్నాడు కానీ అది లవ్ స్టోరీ కాదు. ఇక తాజాగా మరో ఎక్సపెరిమెంట్ కి నితిన్ సిద్దమయ్యాడనే న్యూస్ మొదలయ్యింది. అది యాత్ర దర్శకుడు మహి వి రాఘవన్ తో ఓ సినిమాకి నితిన్ కమిటవ్వబోతున్నాడని, ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా పూర్తయ్యింది అని, ఈ సినిమాలో నితిన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతుండగా.. నితిన్ అభిమానులు మాత్రం చెక్ ఎక్సపీరియెన్స్ చాలలేదా.. మళ్ళీ ఇలాంటివి అవసరమా అంటున్నారు.

Nithin - Mahi V Raghav combo on cards?:

Nithin upcoming movie with Mahi V Raghav

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ