Advertisementt

కోలీవుడ్ డైరెక్టర్ కె.వి.ఆనంద్‌ కన్నుమూత

Fri 30th Apr 2021 09:33 AM
kollywood director,director k.v.anand,cinematographer k.v.anand,k.v.anand passes a way  కోలీవుడ్ డైరెక్టర్ కె.వి.ఆనంద్‌ కన్నుమూత
Director K.V.Anand Passes a way కోలీవుడ్ డైరెక్టర్ కె.వి.ఆనంద్‌ కన్నుమూత
Advertisement
Ads by CJ

కోలీవుడ్‌ లో మొన్న కమెడియన్ వివేక్ మృతి అందరిని కలిచి వేసింది. ఆయన మృతి నుండి తమిళ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌(54) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆనంద్ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కె.వి.ఆనంద్‌ మృతితో కోలీవుడ్ చిత్ర సీమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇద్దరు గొప్ప వ్యక్తులు వెంట వెంటనే మృతిచెందడం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్‌గా 1994లో తెన్నావిన్‌ కోంబత్‌ అనే మలయాళీ చిత్రంతో కె.వి.ఆనంద్‌ కెరీర్‌ను ఆరంభించారు. తమిళం, మలయాళం, తెలుగు, బాలీవుడ్‌ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెన్నావిన్‌ కోంబత్ చిత్రానికిగానూ కె.వి.ఆనంద్‌కు జాతీయ అవార్డు వరించింది. జీవ హీరోగా ఆనంద్ తెరకెక్కించిన రంగం సినిమా తెలుగు, తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆనంద్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేసారు.

Director K.V.Anand Passes a way :

Kollywood Director K.V.Anand Passes a way 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ