Advertisementt

నెగెటివ్ పాత్రలో గ్లామర్ డాల్

Fri 30th Apr 2021 01:53 PM
payal rajput,ott,aha web series,aha ott,payal in negative sheds  నెగెటివ్ పాత్రలో గ్లామర్ డాల్
Payal Rajput negative role for OTT platform నెగెటివ్ పాత్రలో గ్లామర్ డాల్
Advertisement
Ads by CJ

RX 100 మూవీ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బోల్డ్ గా రెచ్చిపోయి నటించిన పాయల్ రాజ్ ఫుట్ కి తర్వాత తెలుగులో సరైన అవకాశాలు రాలేదని చెప్పాలో, లేదంటే పాయల్ రాజ్ ఫుట్ కెరీర్ మలుచుకోవడంలో తడబడింది అని చెప్పాలో తెలియదు కానీ.. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట గ్లామర్ షో చెయ్యడం పాయల్ రాజపుట్ కెరీర్ కి ఆటంకంగా మారింది. దానితో చేతిలో అవాకాశాలు లేక సోషల్ మీడియానే నమ్ముకుంది. గ్లామర్ ఫోటో షూట్స్ తో.. ఎప్పటికప్పుడు అందాల ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే పాయల్ ఇప్పుడొక నెగెటివ్ పాత్ర ఉన్న వెబ్ సీరీస్ చెయ్యబోతుందట.

తెలుగు ఓటిటి ఆహా కోసం పాయల్ రాజ్ ఫుట్ ఓ వెబ్ సీరీస్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఆహా ఓటిటి వారి నిర్మించబోయే త్రీ రోజెస్ వెబ్ సీరీస్ లో ఈ గ్లామర్ డాల్ పాయల్ నెగెటివ్ కేరెక్టర్ చేయబోతోందని తెలుస్తుంది. పాయల్ రాజపుట్ విలనిజమే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుందని.. గ్లామర్ తో కూడిన విలనిజాన్ని పాయల్ ఈ వెబ్ సీరీస్ లో చూపించబోతుందట. మరి ఇప్పటివరకు గ్లామర్ ని నమ్ముకుని కెరీర్ లో తప్పటడుగులు వేసిన పాయల్ ని ఈ వెబ్ సీరీస్ అయినా గాడిన పడేస్తుందేమో చూద్దాం.

Payal Rajput negative role for OTT platform:

Payal Rajput to debut on OTT with web series for Aha 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ