Advertisementt

నా తప్పేం లేదంటున్న యాంకర్ శ్యామల భర్త

Fri 30th Apr 2021 03:43 PM
anchor shyamala,husband narasimha,explanation,arrest,case  నా తప్పేం లేదంటున్న యాంకర్ శ్యామల భర్త
Anchor Shyamala Husband Explanation About Case నా తప్పేం లేదంటున్న యాంకర్ శ్యామల భర్త
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి ఓ మహిళని కోటి రూపారాయల విషయంలో చీట్ చేసిన విషయంగాను పోలీస్ లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే కేసులో నరసింహ కి హెల్ప్ చేసింది అని చెబుతున్న జయంతి గౌడ్ ని కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకోగా.. తన భర్త గురించి తనకి తెలుసు అని, తన భర్త ఎవరిని చీట్ చెయ్యలేదని, అది తప్పుడు కేసు అని, భర్తకి హెల్ప్ చేసింది అని చెప్పిన జయంతి గౌడ్ ఎవరో తనకి తెలియదని, ఈ కేసు విషయం భర్త నరసింహ తో మాట్లాడి తెలుసుకుంటా అని భర్త అరెస్ట్ పై రియాక్ట్ అయిన శ్యామల గత రెండు రోజులుగా సైలెంట్ గానే ఉంది.

అయితే తాజాగా శ్యామల భర్త నరసింహ రెడ్డి ఓ వీడియో ద్వారా తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని, అందులో తన తప్పేమి లేదంటూ చెబుతున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆపద సమయంలో తనకి అండగా నిలిచిన వారికీ కృతఙ్ఞతలు చెప్పాడు. భగవంతుడి దయవల్ల నేను ఇంటికి వచ్చేసానని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది అని, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆ కేసులో నిజానిజాలేమిటో బయట పెడతా అని, దానికి గల ఆధారాలను చూపుతానని, తనకి కోర్టు, న్యాయంపై పూర్తి నమ్మకం ఉంది అంటూ ఆ వీడియో లో నరసింహ చెప్పగా ఆ వీడియో ని శ్యామల తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.

Anchor Shyamala Husband Explanation About Case:

Anchor Shyamala Husband Narasimha Explanation about Case on Him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ