కరోనా సెకండ్ వేవ్ కారణముగా థియేటర్స్ మూతపడడంతో చాలా సినిమాలు వాయిదాల దిశగా పరుగులు తీస్తున్నాయి. నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీశ్, తేజా ఇష్క్, రానా విరాట పర్వం, చిరు ఆచార్య, వెంకీ నారప్ప ఇప్పటికే వాయిదా పడగా.. తరవాత మరిన్ని సినిమాలు వాయిదాల దిశగా అడుగులు వేస్తున్నాయి. మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు ఎన్ని సినిమాలు వెయిట్ చేస్తాయో.. ఎన్ని సినిమాలు ఓటిటి బాట పడతాయో కానీ.. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ పూర్తయ్యి థియేటర్స్ రిలీజ్ డేట్స్ ఇచ్చాక వాయిదా పడిన సినిమాల మీద ఓటిటీలు కన్నేశాయి.
లవ్ స్టోరీ, నాని టక్ జగదీశ్, వెంకీ నారప్ప సినిమాలపై అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ఓటిటి సంస్థలు కన్నెయ్యడమే కాదు.. ఇప్పటికే ఆ సినిమాలకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయట. ఆచార్య సినిమా షూటింగ్ ఫినిష్ కాలేదు కాబట్టి.. అది ఓకె. కానీ నారప్ప సినిమా షూటింగ్ ఫినిష్ అవడంతో ఇప్పడు ఓటిటి సంస్థలు నారప్ప వెనుక పడుతున్నాయి. వెంకీ దృశ్యం 2 థియేటర్స్ లోనే రిలీజ్ అని అంత పెద్ద క్లారిటీ ఇచ్చాక కూడా ఓటిటి సంస్థలు నారప్ప ని కొనడానికి ఎగబడడం అంటే మాములు విషయం కాదు. ఇక నాని అయితే మీరేంతిచ్చినా నేను థియేటర్స్ లో విడుదల చేస్తా అని కూర్చున్నాడట. నాని గతంలో వి సినిమాని అమెజాన్ కి అమ్మెయ్యగా అది.. సో సో టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరి ఎన్ని ఓటిటికి వెళ్తాయో.. ఎన్ని థియేటర్స్ కోసం వెయిట్ చేస్తాయో చూద్దాం.